Exodus · chapter 14 · verse 11
Exodus 14:11 in Telugu
అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?
Antata vaaru mosheto - aiguptulo samaadhulu levani yee yaranyamulo chachchutaku mammunu rappinchitivaa? Mammunu aiguptulonundi bayatiki rappinchi mammunu itlu cheyanela?
Exodus 14:11 in English
- King James Version (KJV)
- And they said unto Moses, Because [there were] no graves in Egypt, hast thou taken us away to die in the wilderness? wherefore hast thou dealt thus with us, to carry us forth out of Egypt?
- World English Bible (WEB)
- They said to Moses, “Because there were no graves in Egypt, have you taken us away to die in the wilderness? Why have you treated us this way, to bring us out of Egypt?
- American Standard Version (ASV)
- And they said unto Moses, Because there were no graves in Egypt, hast thou taken us away to die in the wilderness? wherefore hast thou dealt thus with us, to bring us forth out of Egypt?
- Bible in Basic English (BBE)
- And they said to Moses, Was there no resting-place for the dead in Egypt, that you have taken us away to come to our death in the waste land? why have you taken us out of Egypt?
- Darby Translation (DBY)
- And they said to Moses, Is it because there were no graves in Egypt, thou hast taken us away to die in the wilderness? why hast thou done this to us, that thou hast led us out of Egypt?
- Webster's Bible (WBS)
- And they said to Moses, Because [there were] no graves in Egypt, hast thou taken us away to die in the wilderness? Why hast thou dealt thus with us, to conduct us out of Egypt?
- Young's Literal Translation (YLT)
- And they say unto Moses, 'Because there are no graves in Egypt, hast thou taken us away to die in a wilderness? what is this thou hast done to us — to bring us out from Egypt?
Read in context
- 9ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱము లన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.
- 10ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.
- 11అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?
- 12మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.
- 13అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
Cross references
- Numbers 14:1–4 సంఖ్యాకాండము 14:1–4అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. మరియు ఇశ్రా యేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి. వారుమనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
- Psalm 106:7–8 కీర్తనలు 106:7–8ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
- Exodus 16:2–3 నిర్గమకాండము 16:2–3ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను. ఇశ్రాయేలీయులు - మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా
- Exodus 17:2–3 నిర్గమకాండము 17:2–3మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే - మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.
- Exodus 15:23–24 నిర్గమకాండము 15:23–24మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు - మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
- Numbers 11:1 సంఖ్యాకాండము 11:1జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.
- Numbers 11:15 సంఖ్యాకాండము 11:15నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.