Exodus · chapter 14 · verse 25
Exodus 14:25 in Telugu
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
Vaari rathachakramulu oodipadunatlu cheyagaa vaaru bahu kashtapadi toluchundiri. Appudu aigupteeyulu ishraayeleeyula yedutanundi paaripodamu randi; yehovaa vaaripakshamuna manato yuddhamu cheyuchunnaadani cheppukoniri.
Exodus 14:25 in English
- King James Version (KJV)
- And took off their chariot wheels, that they drave them heavily: so that the Egyptians said, Let us flee from the face of Israel; for the LORD fighteth for them against the Egyptians.
- World English Bible (WEB)
- He took off their chariot wheels, and they drove them heavily; so that the Egyptians said, “Let’s flee from the face of Israel, for the LORD fights for them against the Egyptians!”
- American Standard Version (ASV)
- And he took off their chariot wheels, and they drove them heavily; so that the Egyptians said, Let us flee from the face of Israel; for Jehovah fighteth for them against the Egyptians.
- Bible in Basic English (BBE)
- And made the wheels of their war-carriages stiff, so that they had hard work driving them: so the Egyptians said, Let us go in flight from before the face of Israel, for the Lord is fighting for them against the Egyptians.
- Darby Translation (DBY)
- And he took off their chariot wheels, and caused them to drive with difficulty; and the Egyptians said, Let us flee before Israel, for Jehovah is fighting for them against the Egyptians!
- Webster's Bible (WBS)
- And took off their chariot-wheels, and made them to move heavily, so that the Egyptians said, Let us flee from the face of Israel; for the LORD fighteth for them against the Egyptians.
- Young's Literal Translation (YLT)
- and turneth aside the wheels of their chariots, and they lead them with difficulty, and the Egyptians say, 'Let us flee from the face of Israel, for Jehovah is fighting for them against the Egyptians.'
Read in context
- 23ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
- 24అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి
- 25వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
- 26అంతలో యెహోవా మోషేతో - ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.
- 27మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.
Cross references
- Exodus 14:14 నిర్గమకాండము 14:14యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
- 1 Samuel 4:7–8 1 సమూయేలు 4:7–8జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరు డగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింప గలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.
- Jeremiah 51:21 యిర్మీయా 51:21నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను.
- Deuteronomy 3:22 ద్వితీయోపదేశకాండము 3:22మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.
- Job 20:24 యోబు 20:24ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.
- Amos 9:1 ఆమోసు 9:1యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.
- Amos 5:19 ఆమోసు 5:19ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగు బంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచి నట్టు ఆ దినముండును.
- Job 27:22 యోబు 27:22ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
- Psalm 68:12 కీర్తనలు 68:12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
- Psalm 46:9 కీర్తనలు 46:9ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
- Psalm 76:6 కీర్తనలు 76:6యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
- Job 11:20 యోబు 11:20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
Original words (Hebrew)
- off · H5493סוּר çûwr
- chariot · H4818מֶרְכָּבָה merkâbâh
- wheels · H212אוֹפָן ʼôwphân
- drave · H5090נָהַג nâhag
- heavily · H3517כְּבֵדֻת kᵉbêduth
- Egyptians · H4714מִצְרַיִם Mitsrayim
- said · H559אָמַר ʼâmar
- flee · H5127נוּס nûwç
- face · H6440פָּנִים pânîym
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- fighteth · H3898לָחַם lâcham
- Egyptians · H4714מִצְרַיִם Mitsrayim