Job · chapter 27 · verse 22
Job 27:22 in Telugu
ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
Emiyu karuna choopakunda devudu vaarimeeda baanamulu veyunu vaaru aayana chetilonundi tappinchukonagori itu atu paaripovuduru.
Job 27:22 in English
- King James Version (KJV)
- For [God] shall cast upon him, and not spare: he would fain flee out of his hand.
- World English Bible (WEB)
- For it hurls at him, and does not spare, as he flees away from his hand.
- American Standard Version (ASV)
- For [God] shall hurl at him, and not spare: He would fain flee out of his hand.
- Bible in Basic English (BBE)
- God sends his arrows against him without mercy; he goes in flight before his hand.
- Darby Translation (DBY)
- And [God] shall cast upon him and not spare: he would fain flee out of his hand.
- Webster's Bible (WBS)
- For [God] shall cast upon him, and not spare: he would fain flee out of his hand.
- Young's Literal Translation (YLT)
- And it casteth at him, and doth not spare, From its hand he diligently fleeth.
Read in context
- 20భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
- 21తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
- 22ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
- 23మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
Cross references
- 2 Peter 2:4–5 2 పేతురు 2:4–5దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
- Ezekiel 24:14 యెహెజ్కేలు 24:14యెహోవానైన నేను మాటయిచ్చి యున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 5:11 యెహెజ్కేలు 5:11నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
- Job 11:20 యోబు 11:20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
- Isaiah 10:3 యెషయా 10:3దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు?మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
- Exodus 9:14 నిర్గమకాండము 9:14సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;
- Judges 4:17–21 న్యాయాధిపతులు 4:17–21హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయ పడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా అతడుదప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడుగుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చియిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవుఎవడును లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టు కొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా
- Amos 9:1–3 ఆమోసు 9:1–3యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును. వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును.
- Joshua 10:11 యెహోషువ 10:11మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
- Amos 2:14 ఆమోసు 2:14అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
- Deuteronomy 32:23 ద్వితీయోపదేశకాండము 32:23వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.
- Exodus 14:25–28 నిర్గమకాండము 14:25–28వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో - ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.