Exodus · chapter 25 · verse 18
Exodus 25:18 in Telugu
మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
Mariyu rendu bangaaru keroobulanu cheyavalenu. Karunaapeethamu yokka rendu konalanu nakishipanigaa cheyavalenu.
Exodus 25:18 in English
- King James Version (KJV)
- And thou shalt make two cherubims [of] gold, [of] beaten work shalt thou make them, in the two ends of the mercy seat.
- World English Bible (WEB)
- You shall make two cherubim of hammered gold. You shall make them at the two ends of the mercy seat.
- American Standard Version (ASV)
- And thou shalt make two cherubim of gold; of beaten work shalt thou make them, at the two ends of the mercy-seat.
- Bible in Basic English (BBE)
- And at the two ends of the cover you are to make two winged ones of hammered gold,
- Darby Translation (DBY)
- And thou shalt make two cherubim of gold; [of] beaten work shalt thou make them, at the two ends of the mercy-seat.
- Webster's Bible (WBS)
- And thou shalt make two cherubim [of] gold, [of] beaten work shalt thou make them, in the two ends of the mercy-seat.
- Young's Literal Translation (YLT)
- and thou hast made two cherubs of gold, beaten work dost thou make them, at the two ends of the mercy-seat;
Read in context
- 16ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.
- 17మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయ వలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.
- 18మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
- 19ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
- 20ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
Cross references
- Ezekiel 10:20 యెహెజ్కేలు 10:20కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
- Hebrews 9:5 హెబ్రీయులకు 9:5దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.
- Ezekiel 10:2 యెహెజ్కేలు 10:2అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.
- 1 Kings 8:6–7 1 రాజులు 8:6–7మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను.
- 1 Chronicles 28:18 1 దినవృత్తాంతములు 28:18ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగార మును అతని కప్పగించెను.
- Exodus 37:7–9 నిర్గమకాండము 37:7–9మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.
- Ezekiel 41:18–19 యెహెజ్కేలు 41:18–19కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.
- Genesis 3:24 ఆదికాండము 3:24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
- 1 Samuel 4:4 1 సమూయేలు 4:4కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూ బులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.
- 1 Kings 6:23–28 1 రాజులు 6:23–28మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను; ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.