Ezekiel · chapter 10 · verse 20
Ezekiel 10:20 in Telugu
కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
Kebaaru nadidaggara ishraayelu devuni krinda naaku kanabadina jeevi ide; avi keroobulani nenu gurtupattitini.
Ezekiel 10:20 in English
- King James Version (KJV)
- This [is] the living creature that I saw under the God of Israel by the river of Chebar; and I knew that they [were] the cherubims.
- World English Bible (WEB)
- This is the living creature that I saw under the God of Israel by the river Chebar; and I knew that they were cherubim.
- American Standard Version (ASV)
- This is the living creature that I saw under the God of Israel by the river Chebar; and I knew that they were cherubim.
- Bible in Basic English (BBE)
- This is the living being which I saw under the God of Israel by the river Chebar; and it was clear to me that they were the winged ones.
- Darby Translation (DBY)
- This is the living creature that I saw under the God of Israel by the river Chebar; and I knew that they were cherubim.
- Webster's Bible (WBS)
- This [is] the living creature that I saw under the God of Israel by the river of Kebar; and I knew that they [were] the cherubim.
- Young's Literal Translation (YLT)
- It [is] the living creature that I saw under the God of Israel by the river Chebar, and I know that they are cherubs.
Read in context
- 18యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా
- 19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- 20కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
- 21ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
- 22మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
Cross references
- Ezekiel 1:1 యెహెజ్కేలు 1:1ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.
- Ezekiel 10:15 యెహెజ్కేలు 10:15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.
- 1 Kings 7:36 1 రాజులు 7:36దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.
- 1 Kings 6:29–35 1 రాజులు 6:29–35మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- Ezekiel 3:23 యెహెజ్కేలు 3:23నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను.
- Ezekiel 1:22–28 యెహెజ్కేలు 1:22–28మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను. ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
- Ezekiel 1:5 యెహెజ్కేలు 1:5దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది.