1 Kings · chapter 6 · verse 23
1 Kings 6:23 in Telugu
మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
Mariyu atadu garbhaalayamandu padesi moorala yettugala rendu keroobulanu oleeva karrato cheyinchenu;
1 Kings 6:23 in English
- King James Version (KJV)
- And within the oracle he made two cherubims [of] olive tree, [each] ten cubits high.
- World English Bible (WEB)
- In the inner sanctuary he made two cherubim of olive wood, each ten cubits high.
- American Standard Version (ASV)
- And in the oracle he made two cherubim of olive-wood, each ten cubits high.
- Bible in Basic English (BBE)
- In the inmost room he made two winged beings of olive-wood, ten cubits high;
- Darby Translation (DBY)
- And he made in the oracle two cherubim of olive-wood, ten cubits high;
- Webster's Bible (WBS)
- And within the oracle he made two cherubim [of] olive tree, [each] ten cubits high.
- Young's Literal Translation (YLT)
- And he maketh within the oracle two cherubs, of the oil-tree, ten cubits [is] their height;
Read in context
- 21ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను.
- 22ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.
- 23మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
- 24ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.
- 25రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.
Cross references
- Exodus 37:7–9 నిర్గమకాండము 37:7–9మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- Ezekiel 10:2–22 యెహెజ్కేలు 10:2–22అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను. కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను; అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను; నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను. కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
- Hebrews 1:14 హెబ్రీయులకు 1:14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
- 1 Peter 1:12 1 పేతురు 1:12పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
- Isaiah 37:16 యెషయా 37:16యెహోవా, కెరూ బుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.
- Exodus 25:18–22 నిర్గమకాండము 25:18–22మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
- Psalm 18:10 కీర్తనలు 18:10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- Genesis 3:24 ఆదికాండము 3:24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
- 2 Chronicles 3:10–13 2 దినవృత్తాంతములు 3:10–13అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను.