Exodus · chapter 25 · verse 7
Exodus 25:7 in Telugu
లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
Letapachchalu, ephodukunu patakamunakunu chekku ratnamulu anunave.
Exodus 25:7 in English
- King James Version (KJV)
- Onyx stones, and stones to be set in the ephod, and in the breastplate.
- World English Bible (WEB)
- onyx stones, and stones to be set for the ephod and for the breastplate.
- American Standard Version (ASV)
- onyx stones, and stones to be set, for the ephod, and for the breastplate.
- Bible in Basic English (BBE)
- Beryls and stones of value to be put on the ephod and on the priest's bag.
- Darby Translation (DBY)
- onyx stones, and stones to be set in the ephod, and in the breastplate.
- Webster's Bible (WBS)
- Onyx stones, and stones to be set in the ephod, and in the breast-plate.
- Young's Literal Translation (YLT)
- shoham stones, and stones for setting for an ephod, and for a breastplate.
Read in context
- 5ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
- 6ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,
- 7లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
- 8నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
- 9నేను నీకు కను పరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
Cross references
- Exodus 28:4 నిర్గమకాండము 28:4పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
- Exodus 28:6–30 నిర్గమకాండము 28:6–30బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును. మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను; సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్న ముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది; పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది; గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది; రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమీ్మము అనువాటిని ఉంచ వలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.