Exodus · chapter 29 · verse 39
Exodus 29:39 in Telugu
సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.
Saayankaalamandu oka gorrepillanu arpimpavalenu.
Exodus 29:39 in English
- King James Version (KJV)
- The one lamb thou shalt offer in the morning; and the other lamb thou shalt offer at even:
- World English Bible (WEB)
- The one lamb you shall offer in the morning; and the other lamb you shall offer at evening;
- American Standard Version (ASV)
- The one lamb thou shalt offer in the morning; and the other lamb thou shalt offer at even:
- Bible in Basic English (BBE)
- One lamb is to be offered in the morning and the other in the evening:
- Darby Translation (DBY)
- The one lamb thou shalt offer in the morning; and the other lamb thou shalt offer between the two evenings.
- Webster's Bible (WBS)
- The one lamb thou shalt offer in the morning; and the other lamb thou shalt offer at evening.
- Young's Literal Translation (YLT)
- the one lamb thou dost prepare in the morning, and the second lamb thou dost prepare between the evenings;
Read in context
- 37ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
- 38నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱెపిల్లను
- 39సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.
- 40దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణ ముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.
- 41అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.
Cross references
- Ezekiel 46:13–15 యెహెజ్కేలు 46:13–15మరియు ప్రతి దినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను దహన బలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్య మైన కట్టడలు. గొఱ్ఱెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను.
- 2 Kings 16:15 2 రాజులు 16:15అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగాఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.
- 2 Chronicles 13:11 2 దినవృత్తాంతములు 13:11వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.
- Luke 1:10 లూకా 1:10ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
- Psalm 5:3 కీర్తనలు 5:3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- Psalm 55:16–17 కీర్తనలు 55:16–17అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
- Acts 26:7 అపొస్తలుల కార్యములు 26:7మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.