Exodus · chapter 30 · verse 7
Exodus 30:7 in Telugu
అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
Aharonu pratidinamu prodduna daanimeeda parimaladravyamula dhoopamu veyavalenu. Atadu pradeepamulanu chakka parachunappudu daanimeeda aa dhoopamu veyavalenu.
Exodus 30:7 in English
- King James Version (KJV)
- And Aaron shall burn thereon sweet incense every morning: when he dresseth the lamps, he shall burn incense upon it.
- World English Bible (WEB)
- Aaron shall burn incense of sweet spices on it every morning. When he tends the lamps, he shall burn it.
- American Standard Version (ASV)
- And Aaron shall burn thereon incense of sweet spices: every morning, when he dresseth the lamps, he shall burn it.
- Bible in Basic English (BBE)
- And on this altar sweet spices are to be burned by Aaron every morning when he sees to the lights.
- Darby Translation (DBY)
- And Aaron shall burn thereon fragrant incense: every morning, when he dresseth the lamps, he shall burn the incense.
- Webster's Bible (WBS)
- And Aaron shall burn upon it sweet incense every morning: when he dresseth the lamps, he shall burn incense upon it.
- Young's Literal Translation (YLT)
- 'And Aaron hath made perfume on it, perfume of spices, morning by morning; in his making the lamps right he doth perfume it,
Read in context
- 5అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.
- 6సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
- 7అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
- 8మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.
- 9మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు.
Cross references
- 1 Samuel 2:28 1 సమూయేలు 2:28అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.
- Exodus 27:20–21 నిర్గమకాండము 27:20–21మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
- 1 Chronicles 23:13 1 దినవృత్తాంతములు 23:13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- Luke 1:9 లూకా 1:9యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
- Exodus 30:34 నిర్గమకాండము 30:34మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని
- Acts 6:4 అపొస్తలుల కార్యములు 6:4అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.
- 1 Samuel 3:3 1 సమూయేలు 3:3దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను