Exodus · chapter 40 · verse 6
Exodus 40:6 in Telugu
ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను;
Pratyakshapu gudaarapu mandiradvaaramu neduta dahana balipeetha munu unchavalenu;
Exodus 40:6 in English
- King James Version (KJV)
- And thou shalt set the altar of the burnt offering before the door of the tabernacle of the tent of the congregation.
- World English Bible (WEB)
- “You shall set the altar of burnt offering before the door of the tabernacle of the Tent of Meeting.
- American Standard Version (ASV)
- And thou shalt set the altar of burnt-offering before the door of the tabernacle of the tent of meeting.
- Bible in Basic English (BBE)
- And put the altar of burned offerings before the doorway of the House of the Tent of meeting.
- Darby Translation (DBY)
- And thou shalt set the altar of burnt-offering before the entrance of the tabernacle of the tent of meeting.
- Webster's Bible (WBS)
- And thou shalt set the altar of the, burnt-offering before the door of the tabernacle of the tent of the congregation.
- Young's Literal Translation (YLT)
- and hast put the altar of the burnt-offering before the opening of the tabernacle of the tent of meeting,
Read in context
- 4నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
- 5సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగిలింపవలెను.
- 6ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను;
- 7ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
- 8తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింప వలెను.
Cross references
- Exodus 40:29 నిర్గమకాండము 40:29దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
- Hebrews 13:10 హెబ్రీయులకు 13:10మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.
- Ephesians 1:6–7 ఎఫెసీయులకు 1:6–7మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
- Exodus 38:1–7 నిర్గమకాండము 38:1–7మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను. ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
- 1 John 4:9–10 1 యోహాను 4:9–10మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
- Exodus 27:1–8 నిర్గమకాండము 27:1–8మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను. దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను. మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
- 1 John 2:2 1 యోహాను 2:2ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.