Ezekiel · chapter 16 · verse 26
Ezekiel 16:26 in Telugu
మరియు నీవు మదించి యున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.
Mariyu neevu madinchi yunna nee poruguvaaraina aigupteeyulato vyabhicharinchi nee jaaratvakriyalanu pempuchesi naaku kopamu puttinchitivi.
Ezekiel 16:26 in English
- King James Version (KJV)
- Thou hast also committed fornication with the Egyptians thy neighbours, great of flesh; and hast increased thy whoredoms, to provoke me to anger.
- World English Bible (WEB)
- You have also committed sexual immorality with the Egyptians, your neighbors, great of flesh; and have multiplied your prostitution, to provoke me to anger.
- American Standard Version (ASV)
- Thou hast also committed fornication with the Egyptians, thy neighbors, great of flesh; and hast multiplied thy whoredom, to provoke me to anger.
- Bible in Basic English (BBE)
- And you went with the Egyptians, your neighbours, great of flesh; increasing your loose ways, moving me to wrath.
- Darby Translation (DBY)
- And thou didst commit fornication with the Egyptians thy neighbours, great of flesh; and didst multiply thy whoredom to provoke me to anger.
- Webster's Bible (WBS)
- Thou hast also committed fornication with the Egyptians thy neighbors, great of flesh; and hast multiplied thy lewd deeds, to provoke me to anger.
- Young's Literal Translation (YLT)
- And dost go a-whoring unto sons of Egypt, Thy neighbours — great of appetite! And thou dost multiply thy whoredoms, To provoke Me to anger.
Read in context
- 24నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలి పీఠములను ఏర్పరచితివి,
- 25ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.
- 26మరియు నీవు మదించి యున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.
- 27కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించు చున్నాను.
- 28అంతటితో తృప్తినొందక అష్షూరువారి తోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి.
Cross references
- Ezekiel 23:19–21 యెహెజ్కేలు 23:19–21మరియు ¸యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను. గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.
- Ezekiel 20:7–8 యెహెజ్కేలు 20:7–8అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.
- Isaiah 30:21 యెషయా 30:21మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
- Ezekiel 23:8 యెహెజ్కేలు 23:8మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
- Joshua 24:14 యెహోషువ 24:14కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.
- Jeremiah 7:18–19 యిర్మీయా 7:18–19నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.
- Ezekiel 8:10 యెహెజ్కేలు 8:10నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహ ములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.
- Ezekiel 8:17 యెహెజ్కేలు 8:17అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.
- Ezekiel 23:3 యెహెజ్కేలు 23:3వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.
- Ezekiel 8:14 యెహెజ్కేలు 8:14యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.
- Exodus 32:4 నిర్గమకాండము 32:4అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
- Deuteronomy 29:16–17 ద్వితీయోపదేశకాండము 29:16–17మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చి తిమో మీరెరుగుదురు. వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.