Ezekiel · chapter 21 · verse 10
Ezekiel 21:10 in Telugu
అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?
Adi goppa vadha cheyutakai padunu pettiyunnadi, talatalalaadunatlu adi merugupettiyunnadi; itlundagaa naa kumaaruni dandamu itara dandamulannitini truneekarinchunadi ani cheppi manamu santoshinchedamaa?
Ezekiel 21:10 in English
- King James Version (KJV)
- It is sharpened to make a sore slaughter; it is furbished that it may glitter: should we then make mirth? it contemneth the rod of my son, [as] every tree.
- World English Bible (WEB)
- It is sharpened that it may make a slaughter. It is polished that it may be as lightning. Should we then make mirth? The rod of my son condemns every tree.
- American Standard Version (ASV)
- it is sharpened that it may make a slaughter; it is furbished that it may be as lightning: shall we then make mirth? the rod of my son, it contemneth every tree.
- Bible in Basic English (BBE)
- It has been made sharp to give death; it is polished so that it may be like a thunder-flame: ...
- Darby Translation (DBY)
- It is sharpened for sore slaughter, it is furbished that it may glitter. Shall we then make mirth, [saying,] The sceptre of my son contemneth all wood?
- Webster's Bible (WBS)
- It is sharpened to make a grievous slaughter; it is furbished that it may glitter: should we then make mirth? it contemneth the rod of my son, [as] every tree.
- Young's Literal Translation (YLT)
- So as to slaughter a slaughter it is sharpened. So as to have brightness it is polished, Desire hath rejoiced the sceptre of my son, It is despising every tree.
Read in context
- 8మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 9నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది.
- 10అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?
- 11మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.
- 12నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
Cross references
- Psalm 110:5–6 కీర్తనలు 110:5–6ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
- Ezekiel 20:47 యెహెజ్కేలు 20:47దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.
- Jeremiah 46:4 యిర్మీయా 46:4గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.
- Ecclesiastes 3:4 ప్రసంగి 3:4ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;
- Isaiah 34:5–6 యెషయా 34:5–6నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
- Revelation 2:27 ప్రకటన 2:27అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
- Esther 3:15 ఎస్తేరు 3:15అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
- Psalm 89:38–45 కీర్తనలు 89:38–45ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు. నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు. అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు అతని ¸యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా. )
- Nahum 1:10 నహూము 1:10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
- Ezekiel 21:25–27 యెహెజ్కేలు 21:25–27గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
- Psalm 2:7–9 కీర్తనలు 2:7–9కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
- Habakkuk 3:11 హబక్కూకు 3:11నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.