Ezekiel · chapter 24 · verse 8
Ezekiel 24:8 in Telugu
కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.
Kaavuna naa krodhamu raanichchi, nenu pratikaaramu cheyunatlu adi chindinchina raktamu kappabadakunda daanini vattibandameeda nenunda nichchitini.
Ezekiel 24:8 in English
- King James Version (KJV)
- That it might cause fury to come up to take vengeance; I have set her blood upon the top of a rock, that it should not be covered.
- World English Bible (WEB)
- That it may cause wrath to come up to take vengeance, I have set her blood on the bare rock, that it should not be covered.”
- American Standard Version (ASV)
- That it may cause wrath to come up to take vengeance, I have set her blood upon the bare rock, that it should not be covered.
- Bible in Basic English (BBE)
- In order that it might make wrath come up to give punishment, she has put her blood on the open rock, so that it may not be covered.
- Darby Translation (DBY)
- That it might cause fury to come up to execute vengeance, I have set her blood upon the bare rock, that it should not be covered.
- Webster's Bible (WBS)
- That it might cause fury to come up to take vengeance; I have set her blood upon the top of a rock, that it should not be covered.
- Young's Literal Translation (YLT)
- To cause fury to come up to take vengeance, I have put her blood on a clear place of a rock — not to be covered.
Read in context
- 6కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగల కుండా, మానకుండ మడ్డిగలిగియుండు కుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.
- 7దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.
- 8కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.
- 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.
- 10చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజ బెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.
Cross references
- Deuteronomy 32:21–22 ద్వితీయోపదేశకాండము 32:21–22వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.
- Jeremiah 7:20 యిర్మీయా 7:20అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.
- 2 Chronicles 34:25 2 దినవృత్తాంతములు 34:25వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఈ స్థలముమీద మితి లేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.
- Jeremiah 22:8–9 యిర్మీయా 22:8–9అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందు నిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.
- Jeremiah 7:18 యిర్మీయా 7:18నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
- 2 Kings 22:17 2 రాజులు 22:17ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొను చున్నది.
- Jeremiah 15:1–4 యిర్మీయా 15:1–4అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము. మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెర కును పోవలెను. యెహోవా వాక్కు ఇదే - చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను. యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకల రాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.
- Ezekiel 8:17–18 యెహెజ్కేలు 8:17–18అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
- 2 Chronicles 36:16–17 2 దినవృత్తాంతములు 36:16–17పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మంది రములోనే వారి ¸యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు ¸యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్ప గించెను.
- Ezekiel 23:45 యెహెజ్కేలు 23:45అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.
- Matthew 7:2 మత్తయి 7:2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
- Revelation 18:16 ప్రకటన 18:16అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.