Ezekiel · chapter 30 · verse 11
Ezekiel 30:11 in Telugu
జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.
Janamulalo bhayankarulagu tana janulanu todukoni aa deshamunu layaparuchutaku atadu vachchunu, aigupteeyulanu champutakai vaaru tama khadgamulanu oradeesi hatamaina vaarito deshamunu nimpedaru.
Ezekiel 30:11 in English
- King James Version (KJV)
- He and his people with him, the terrible of the nations, shall be brought to destroy the land: and they shall draw their swords against Egypt, and fill the land with the slain.
- World English Bible (WEB)
- He and his people with him, the terrible of the nations, will be brought in to destroy the land. They will draw their swords against Egypt, and fill the land with the slain.
- American Standard Version (ASV)
- He and his people with him, the terrible of the nations, shall be brought in to destroy the land; and they shall draw their swords against Egypt, and fill the land with the slain.
- Bible in Basic English (BBE)
- He and the people with him, causing fear among the nations, will be sent for the destruction of the land; their swords will be let loose against Egypt and the land will be full of dead.
- Darby Translation (DBY)
- He and his people with him, the terrible of the nations, shall be brought to destroy the land; and they shall draw their swords against Egypt, and fill the land with slain.
- Webster's Bible (WBS)
- He and his people with him, the terrible of the nations, shall be brought to destroy the land: and they shall draw their swords against Egypt, and fill the land with the slain.
- Young's Literal Translation (YLT)
- He and his people with him — the terrible of nations, Are brought in to destroy the land, And they have drawn their swords against Egypt, And have filled the land [with] the wounded.
Read in context
- 9ఆ దినమందు దూతలు నా యెదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగి నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
- 10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.
- 11జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.
- 12నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను
- 13యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.
Cross references
- Ezekiel 28:7 యెహెజ్కేలు 28:7నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్య మును నీచపరతురు,
- Ezekiel 32:12 యెహెజ్కేలు 32:12శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును.
- Ezekiel 39:4 యెహెజ్కేలు 39:4నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.
- Jeremiah 51:20–23 యిర్మీయా 51:20–23నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కి టెద్దులను విరుగ గొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.
- Isaiah 14:4–6 యెషయా 14:4–6నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.
- Ezekiel 35:8 యెహెజ్కేలు 35:8అతని పర్వతములను హత మైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయల లోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.
- Zephaniah 1:17–18 జెఫన్యా 1:17–18జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.
- Deuteronomy 28:50 ద్వితీయోపదేశకాండము 28:50క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును.
- Isaiah 34:3–7 యెషయా 34:3–7వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును. వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.
- Habakkuk 1:6–9 హబక్కూకు 1:6–9ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి;వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.
- Ezekiel 39:11–20 యెహెజ్కేలు 39:11–20ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు. దేశ మును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు. మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరు గును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు; బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱెపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 31:12 యెహెజ్కేలు 31:12జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండల లోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.
Original words (Hebrew)
- people · H5971עַם ʻam
- terrible · H6184עָרִיץ ʻârîyts
- nations · H1471גּוֹי gôwy
- brought · H935בּוֹא bôwʼ
- destroy · H7843שָׁחַת shâchath
- land · H776אֶרֶץ ʼerets
- draw · H7324רוּק rûwq
- swords · H2719חֶרֶב chereb
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- fill · H4390מָלֵא mâlêʼ
- land · H776אֶרֶץ ʼerets
- slain · H2491חָלָל châlâl