Ezekiel · chapter 36 · verse 11
Ezekiel 36:11 in Telugu
మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
Mee meeda manushyulanu pashuvulanu vistarimpajesedanu, avi vistarinchi abhivruddhi nondunu, poorvamunnattu mimmunu nivaasa sthalamugaa chesi, munupatikante adhikamaina melu meeku kalugajesedanu, appudu nenu yehovaanai yunnaanani meeru telisikonduru.
Ezekiel 36:11 in English
- King James Version (KJV)
- And I will multiply upon you man and beast; and they shall increase and bring fruit: and I will settle you after your old estates, and will do better [unto you] than at your beginnings: and ye shall know that I [am] the LORD.
- World English Bible (WEB)
- I will multiply man and animal on you. They will increase and be fruitful. I will cause you to be inhabited as you were before, and you will do better than at your beginnings. Then you will know that I am the LORD.
- American Standard Version (ASV)
- and I will multiply upon you man and beast; and they shall increase and be fruitful; and I will cause you to be inhabited after your former estate, and will do better [unto you] than at your beginnings: and ye shall know that I am Jehovah.
- Bible in Basic English (BBE)
- Man and beast will be increased in you, and they will have offspring and be fertile: I will make you thickly peopled as you were before, and will do more for you than at the first: and you will be certain that I am the Lord.
- Darby Translation (DBY)
- And I will multiply upon you man and beast, and they shall increase and bring forth fruit; and I will cause you to be inhabited as [in] your former times, yea, I will make it better than at your beginnings: and ye shall know that I [am] Jehovah.
- Webster's Bible (WBS)
- And I will multiply upon you man and beast; and they shall increase and bring fruit: and I will settle you after your old states, and will do better [to you] than at your beginnings: and ye shall know that I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- And I have multiplied on you man and beast, And they have multiplied and been fruitful, And I have caused you to dwell according to your former states, And I have done better than at your beginnings, And ye have known that I [am] Jehovah.
Read in context
- 9నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.
- 10మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును.
- 11మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
- 12మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.
- 13ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.
Cross references
- Jeremiah 33:12 యిర్మీయా 33:12సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.
- Jeremiah 23:5–8 యిర్మీయా 23:5–8యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.
- Micah 7:14 మీకా 7:14నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు.
- Jeremiah 31:27 యిర్మీయా 31:27యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.
- Ezekiel 37:13 యెహెజ్కేలు 37:13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా
- Hosea 2:20 హోషేయ 2:20నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.
- Jeremiah 30:18 యిర్మీయా 30:18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులుగలదగును.
- Job 42:12 యోబు 42:12యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.
- Ezekiel 16:55 యెహెజ్కేలు 16:55సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు.
- Amos 9:15 ఆమోసు 9:15వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Obadiah 1:19–21 ఓబద్యా 1:19–21దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీ నీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెర పట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణ ములను స్వతంత్రించుకొందురు. మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
- Joel 3:18–21 యోవేలు 3:18–21ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.