Ezekiel · chapter 36 · verse 3
Ezekiel 36:3 in Telugu
వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.
Vachanametti eelaagu pravachimpumu prabhuvagu yehovaa selavichchuna demanagaasheshinchina anyajanulaku meeru svaadheenulagunatlu gaanu, nindinchuvaaricheta janula drushtiki meeru apahaasyaa spadamagunatlugaanu, naludikkula mee shatruvulu mimmanu pattukona naashinchi mimmunu paaduchesiyunnaaru.
Ezekiel 36:3 in English
- King James Version (KJV)
- Therefore prophesy and say, Thus saith the Lord GOD; Because they have made [you] desolate, and swallowed you up on every side, that ye might be a possession unto the residue of the heathen, and ye are taken up in the lips of talkers, and [are] an infamy of the people:
- World English Bible (WEB)
- therefore prophesy, and say, ‘The Lord GOD says: “Because, even because they have made you desolate, and swallowed you up on every side, that you might be a possession to the residue of the nations, and you are taken up in the lips of talkers, and the evil report of the people;”
- American Standard Version (ASV)
- therefore prophesy, and say, Thus saith the Lord Jehovah: Because, even because they have made you desolate, and swallowed you up on every side, that ye might be a possession unto the residue of the nations, and ye are taken up in the lips of talkers, and the evil report of the people;
- Bible in Basic English (BBE)
- For this cause be a prophet, and say, This is what the Lord has said: Because, even because they have been glad over you and put you to shame on every side, because you have become a heritage for the rest of the nations, and you are taken up on the lips of talkers and in the evil talk of the people:
- Darby Translation (DBY)
- therefore prophesy and say, Thus saith the Lord Jehovah: Because, yea, because they have made [you] desolate, and have swallowed you up on every side, that ye might be a possession unto the remnant of the nations, and ye are taken up in the lips of talkers, and in the defaming of the people:
- Webster's Bible (WBS)
- Therefore prophesy and say, Thus saith the Lord GOD; Because they have made [you] desolate, and swallowed you up on every side, that ye might be a possession to the residue of the heathen, and ye are taken up in the lips of talkers, and [are] an infamy of the people:
- Young's Literal Translation (YLT)
- therefore, prophesy, and thou hast said: Thus said the Lord Jehovah: Because, even because, of desolating, And of swallowing you up from round about, For your being a possession to the remnant of the nations, And ye are taken up on the tip of the tongue, And [are] an evil report of the people.
Read in context
- 1మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,
- 2ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.
- 3వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.
- 4కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుశేషించిన అన్యజనులకు అపహాస్యాస్ప దమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థల ములతోను నిర్జనమైన పట్టణములతోను
- 5ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులనందరిని బట్టియు, శేషించిన అన్య జనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.
Cross references
- Psalm 44:13–14 కీర్తనలు 44:13–14మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి యున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
- Jeremiah 18:16 యిర్మీయా 18:16వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
- Lamentations 2:15–16 విలాపవాక్యములు 2:15–16త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
- Daniel 9:16 దానియేలు 9:16ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
- Jeremiah 41:1–18 యిర్మీయా 41:1–18ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియ మించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదుల నందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి. ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి. అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారి పోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత, కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి; అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.
- Deuteronomy 28:37 ద్వితీయోపదేశకాండము 28:37యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.
- Lamentations 2:2 విలాపవాక్యములు 2:2ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసి యున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు.
- Proverbs 1:12 సామెతలు 1:12పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
- Psalm 69:12 కీర్తనలు 69:12గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
- Jeremiah 33:24 యిర్మీయా 33:24తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
- Jeremiah 24:9 యిర్మీయా 24:9మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదము గాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
- 1 Kings 9:7–8 1 రాజులు 9:7–8నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
Original words (Hebrew)
- prophesy · H5012נָבָא nâbâʼ
- say · H559אָמַר ʼâmar
- saith · H559אָמַר ʼâmar
- Lord · H136אֲדֹנָי ʼĂdônây
- desolate · H8074שָׁמֵם shâmêm
- up · H7602שָׁאַף shâʼaph
- side · H5439סָבִיב çâbîyb
- possession · H4181מוֹרָשָׁה môwrâshâh
- residue · H7611שְׁאֵרִית shᵉʼêrîyth
- heathen · H1471גּוֹי gôwy
- up · H5927עָלָה ʻâlâh
- lips · H8193שָׂפָה sâphâh
- talkers · H3956לָשׁוֹן lâshôwn
- infamy · H1681דִּבָּה dibbâh
- people · H5971עַם ʻam