Ezekiel · chapter 39 · verse 13
Ezekiel 39:13 in Telugu
నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.
Nenu ghanamu vahinchu dinamuna deshapu janulandaru vaarini paati pettuduru; daanivalana vaaru keerti nondedaru; ide yehovaa vaakku.
Ezekiel 39:13 in English
- King James Version (KJV)
- Yea, all the people of the land shall bury [them;] and it shall be to them a renown the day that I shall be glorified, saith the Lord GOD.
- World English Bible (WEB)
- Yes, all the people of the land will bury them; and they will become famous in the day that I will be glorified,” says the Lord GOD.
- American Standard Version (ASV)
- Yea, all the people of the land shall bury them; and it shall be to them a renown in the day that I shall be glorified, saith the Lord Jehovah.
- Bible in Basic English (BBE)
- And all the people of the land will put them in the earth; and it will be to their honour in the day when I let my glory be seen, says the Lord.
- Darby Translation (DBY)
- and all the people of the land shall bury [them]; and it shall be to them for renown in the day that I shall be glorified, saith the Lord Jehovah.
- Webster's Bible (WBS)
- Yes, all the people of the land shall bury [them] : and it shall be to them a renown in the day that I shall be glorified, saith the Lord GOD.
- Young's Literal Translation (YLT)
- Yea, all the people of the land have buried them, and it hath been to them for a name — the day of My being honoured — an affirmation of the Lord Jehovah.
Read in context
- 11ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.
- 12దేశ మును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.
- 13నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.
- 14దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.
- 15దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు.
Cross references
- Ezekiel 28:22 యెహెజ్కేలు 28:22సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధ పరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.
- Zephaniah 3:19–20 జెఫన్యా 3:19–20ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను, ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 33:9 యిర్మీయా 33:9భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు.
- Deuteronomy 26:19 ద్వితీయోపదేశకాండము 26:19తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహో వాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.
- Psalm 149:6–9 కీర్తనలు 149:6–9వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
- Psalm 126:2–3 కీర్తనలు 126:2–3మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.
- Ezekiel 39:21–22 యెహెజ్కేలు 39:21–22నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్య జనులందరు చూచెదరు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.
- 1 Peter 1:7 1 పేతురు 1:7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.