Ezekiel · chapter 39 · verse 21
Ezekiel 39:21 in Telugu
నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్య జనులందరు చూచెదరు.
Naa ghanatanu anyajanulalo aguparachedanu, nenu chesina teerpunu vaarimeeda nenu vesina naa hastamunu anya janulandaru choochedaru.
Ezekiel 39:21 in English
- King James Version (KJV)
- And I will set my glory among the heathen, and all the heathen shall see my judgment that I have executed, and my hand that I have laid upon them.
- World English Bible (WEB)
- “I will set my glory among the nations. Then all the nations will see my judgment that I have executed, and my hand that I have laid on them.
- American Standard Version (ASV)
- And I will set my glory among the nations; and all the nations shall see my judgment that I have executed, and my hand that I have laid upon them.
- Bible in Basic English (BBE)
- And I will put my glory among the nations, and all the nations will see my punishments which I have put into effect, and my hand which I have put on them.
- Darby Translation (DBY)
- And I will set my glory among the nations, and all the nations shall see my judgment which I have executed, and my hand which I have laid upon them.
- Webster's Bible (WBS)
- And I will set my glory among the heathen, and all the heathen shall see my judgment that I have executed, and my hand that I have laid upon them.
- Young's Literal Translation (YLT)
- And I have given My honour among nations, And seen have all the nations My Judgment that I have done, And My hand that I have laid on them.
Read in context
- 19నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు.
- 20నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 21నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్య జనులందరు చూచెదరు.
- 22ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.
- 23మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెర లోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలు నట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్య జనులు తెలిసికొందురు.
Cross references
- Ezekiel 38:23 యెహెజ్కేలు 38:23నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.
- Exodus 9:16 నిర్గమకాండము 9:16నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
- Isaiah 37:20 యెషయా 37:20యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.
- Ezekiel 36:23 యెహెజ్కేలు 36:23అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 38:16 యెహెజ్కేలు 38:16మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.
- Exodus 7:4 నిర్గమకాండము 7:4ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
- 1 Samuel 5:11 1 సమూయేలు 5:11కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించిఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జను లను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.
- Exodus 14:4 నిర్గమకాండము 14:4అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
- Exodus 8:19 నిర్గమకాండము 8:19శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
- Ezekiel 39:13 యెహెజ్కేలు 39:13నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.
- 1 Samuel 5:7 1 సమూయేలు 5:7అష్డోదువారు సంభవించిన దాని చూచిఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవత యగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని
- Malachi 1:11 మలాకీ 1:11తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.