Ezekiel · chapter 46 · verse 4
Ezekiel 46:4 in Telugu
విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
Vishraantidinamuna adhipati yehovaaku arpimpa valasina dahanabali yedanagaa, nirdoshamaina aaru gorre pillalunu nirdoshamaina yoka pottelunu.
Ezekiel 46:4 in English
- King James Version (KJV)
- And the burnt offering that the prince shall offer unto the LORD in the sabbath day [shall be] six lambs without blemish, and a ram without blemish.
- World English Bible (WEB)
- The burnt offering that the prince shall offer to the LORD shall be on the Sabbath day, six lambs without defect and a ram without defect;
- American Standard Version (ASV)
- And the burnt-offering that the prince shall offer unto Jehovah shall be on the sabbath day six lambs without blemish and a ram without blemish;
- Bible in Basic English (BBE)
- And the burned offering offered to the Lord by the ruler on the Sabbath day is to be six lambs without a mark on them and a male sheep without a mark;
- Darby Translation (DBY)
- And the burnt-offering that the prince shall present unto Jehovah on the sabbath-day shall be six lambs without blemish, and a ram without blemish.
- Webster's Bible (WBS)
- And the burnt-offering that the prince shall offer to the LORD in the sabbath day [shall be] six lambs without blemish, and a ram without blemish.
- Young's Literal Translation (YLT)
- 'And the burnt-offering that the prince bringeth near to Jehovah on the day of rest [is] six lambs, perfect ones, and a ram, a perfect one.
Read in context
- 2అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధ పరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.
- 3మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.
- 4విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
- 5పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.
- 6అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
Cross references
- Ezekiel 45:17 యెహెజ్కేలు 45:17పండుగలలోను, అమా వాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రా యేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడ బడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.
- Numbers 28:9–10 సంఖ్యాకాండము 28:9–10విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.