Ezra · chapter 6 · verse 17
Ezra 6:17 in Telugu
దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
Devuni mandiramunu pratishthinchinappudu nooru edlanu rendu vandala pottellanu naaluguvandala gorrepillalanu ishraa yeleeyulakandarikini paapaparihaaraartha baligaa ishraayelee yula gotramula lekkachoppuna pandrendu meka potulanu arpinchiri.
Ezra 6:17 in English
- King James Version (KJV)
- And offered at the dedication of this house of God an hundred bullocks, two hundred rams, four hundred lambs; and for a sin offering for all Israel, twelve he goats, according to the number of the tribes of Israel.
- World English Bible (WEB)
- They offered at the dedication of this house of God one hundred bulls, two hundred rams, four hundred lambs; and for a sin offering for all Israel, twelve male goats, according to the number of the tribes of Israel.
- American Standard Version (ASV)
- And they offered at the dedication of this house of God a hundred bullocks, two hundred rams, four hundred lambs; and for a sin-offering for all Israel, twelve he-goats, according to the number of the tribes of Israel.
- Bible in Basic English (BBE)
- And they gave as offerings at the opening of this house of God a hundred oxen, two hundred sheep, four hundred lambs; and for a sin-offering for all Israel, twelve he-goats, being the number of the tribes of Israel.
- Darby Translation (DBY)
- and they presented at the dedication of this house of God a hundred bullocks, two hundred rams, four hundred lambs, and for a sin-offering for all Israel, twelve he-goats, according to the number of the tribes of Israel.
- Webster's Bible (WBS)
- And offered at the dedication of this house of God a hundred bullocks, two hundred rams, four hundred lambs; and for a sin-offering for all Israel, twelve he-goats, according to the number of the tribes of Israel.
- Young's Literal Translation (YLT)
- and have brought near for the dedication of this house of God, bullocks a hundred, rams two hundred, lambs four hundred; and young he-goats for a sin-offering for all Israel, twelve, according to the number of the tribes of Israel;
Read in context
- 15రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
- 16అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.
- 17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
- 18మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.
- 19చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.
Cross references
- Ezra 8:35 ఎజ్రా 8:35మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బది యేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి.
- 2 Chronicles 29:21–23 2 దినవృత్తాంతములు 29:21–23రాజ్యముకొరకును పరిశుద్ధస్థలముకొరకును యూదావారికొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱెపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడుయెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను. పరిచార కులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసికొని బలిపీఠముమీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్లేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. వారు గొఱ్ఱెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. పాపపరిహారార్థబలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమ చేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి
- Revelation 7:4–8 ప్రకటన 7:4–8మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది, ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది, షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది, జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
- 2 Chronicles 7:5 2 దినవృత్తాంతములు 7:5రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను
- 2 Chronicles 29:31–35 2 దినవృత్తాంతములు 29:31–35అంతట హిజ్కియామీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసి కొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలుల నర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసికొని వచ్చిరి. సమాజపువారు తీసికొని వచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱెపిల్లలును; ఇవి యన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణ మగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిరసేవ క్రమముగా జరిగెను.
- Leviticus 4:13–14 లేవీయకాండము 4:13–14ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
- Leviticus 4:22–23 లేవీయకాండము 4:22–23అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి
- Numbers 7:2–89 సంఖ్యాకాండము 7:2–89దాని ఉపకరణములన్నిటిని బలి పీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబ ములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను. అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను. కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱె పిల్లను అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. ఒ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము. ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణ ముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము. ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను అపరాధపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీష దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తినిఒ దహనబలిగా ఒక చిన్నకోడెను ఒకపొట్టె లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు, సమా ధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు, పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది. మోషే యెహోవాతో మాట లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.
- Leviticus 4:3 లేవీయకాండము 4:3ప్రజలు అపరాధులగునట్లు అభి షిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
- 1 Kings 8:63–64 1 రాజులు 8:63–64ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవర ణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.
- 1 Kings 18:31 1 రాజులు 18:31యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని
- Leviticus 4:28 లేవీయకాండము 4:28తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి
Original words (Hebrew)
- offered · H7127קְרֵב qᵉrêb
- dedication · H2597חֲנֻכָּא chănukkâʼ
- this · H1836דֵּן dên
- house · H1005בַּיִת bayith
- God · H426אֱלָהּ ʼĕlâhh
- hundred · H3969מְאָה mᵉʼâh
- bullocks · H8450תּוֹר tôwr
- hundred · H3969מְאָה mᵉʼâh
- rams · H1798דְּכַר dᵉkar
- four · H703אַרְבַּע ʼarbaʻ
- hundred · H3969מְאָה mᵉʼâh
- lambs · H563אִמַּר ʼimmar
- offering · H2402חַטָּאָה chaṭṭâʼâh
- for · H5922עַל ʻal
- all · H3606כֹּל kôl
- Israel · H3479יִשְׂרָאֵל Yisrâʼêl
- twelve · H8648תְּרֵין tᵉrêyn
- he · H6841צְפִיר tsᵉphîyr
- goats · H5796עֵז ʻêz
- number · H4510מִנְיָן minyân
- tribes · H7625שְׁבַט shᵉbaṭ
- Israel · H3479יִשְׂרָאֵל Yisrâʼêl