Galatians · chapter 5 · verse 20
Galatians 5:20 in Telugu
విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
Vigrahaaraadhana, abhichaaramu, dveshamulu, kalahamu, matsaramulu, krodhamulu, kakshalu,
Galatians 5:20 in English
- King James Version (KJV)
- Idolatry, witchcraft, hatred, variance, emulations, wrath, strife, seditions, heresies,
- World English Bible (WEB)
- idolatry, sorcery, hatred, strife, jealousies, outbursts of anger, rivalries, divisions, heresies,
- American Standard Version (ASV)
- idolatry, sorcery, enmities, strife, jealousies, wraths, factions, divisions, parties,
- Bible in Basic English (BBE)
- Worship of images, use of strange powers, hates, fighting, desire for what another has, angry feelings, attempts to get the better of others, divisions, false teachings,
- Darby Translation (DBY)
- idolatry, sorcery, hatred, strifes, jealousies, angers, contentions, disputes, schools of opinion,
- Webster's Bible (WBS)
- Idolatry, witchcraft, hatred, variance, emulations, wrath, strife, seditions, heresies,
- Young's Literal Translation (YLT)
- idolatry, witchcraft, hatred, strifes, emulations, wraths, rivalries, dissensions, sects,
Read in context
- 18మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మ శాస్త్రమునకు లోనైనవారు కారు.
- 19శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
- 20విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
- 21భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
- 22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
Cross references
- Revelation 21:8 ప్రకటన 21:8పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
- 1 Corinthians 11:19 1 కొరింథీయులకు 11:19మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.
- Titus 3:10 తీతుకు 3:10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
- 2 Corinthians 11:19 2 కొరింథీయులకు 11:19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
- Acts 8:9–11 అపొస్తలుల కార్యములు 8:9–11సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పు కొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరుదేవుని మహాశక్తి యనబడిన వాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్య పెట్టిరి.
- 1 Chronicles 10:13–14 1 దినవృత్తాంతములు 10:13–14ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.
- Deuteronomy 18:10 ద్వితీయోపదేశకాండము 18:10తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
- Acts 16:16–19 అపొస్తలుల కార్యములు 16:16–19మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగినీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి.
- 2 Peter 2:1 2 పేతురు 2:1మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
- Ezekiel 22:18 యెహెజ్కేలు 22:18నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.
- 2 Chronicles 33:6 2 దినవృత్తాంతములు 33:6బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
- 1 Samuel 15:23 1 సమూయేలు 15:23తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా