Genesis · chapter 17 · verse 12
Genesis 17:12 in Telugu
ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
Enimidi dinamula vayassu galavaadu, anagaa nee yinta puttinavaadainanu, nee santaanamu kaani anyuni yodda vendito konabadina vaadainanu, mee taramulalo prati magavaadu meelo sunnati pondavalenu.
Genesis 17:12 in English
- King James Version (KJV)
- And he that is eight days old shall be circumcised among you, every man child in your generations, he that is born in the house, or bought with money of any stranger, which [is] not of thy seed.
- World English Bible (WEB)
- He who is eight days old shall be circumcised among you, every male throughout your generations, he who is born in the house, or bought with money from any foreigner who is not of your offspring.
- American Standard Version (ASV)
- And he that is eight days old shall be circumcised among you, every male throughout your generations, he that is born in the house, or bought with money of any foreigner that is not of thy seed.
- Bible in Basic English (BBE)
- Every male among you, from one generation to another, is to undergo circumcision when he is eight days old, with every servant whose birth takes place in your house, or for whom you gave money to someone of another country, and not of your seed.
- Darby Translation (DBY)
- And at eight days old shall every male in your generations be circumcised among you — he who is born in the house, and he who is bought with money, any stranger who is not of thy seed.
- Webster's Bible (WBS)
- And he that is eight days old shall be circumcised among you, every male-child in your generations, he that is born in the house, or bought with money of any stranger, who [is] not of thy seed.
- Young's Literal Translation (YLT)
- 'And a son of eight days is circumcised by you; every male to your generations, born in the house, or bought with money from any son of a stranger, who is not of thy seed;
Read in context
- 10నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
- 11మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
- 12ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
- 13నీ యింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.
- 14సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.
Cross references
- Leviticus 12:3 లేవీయకాండము 12:3ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
- Luke 2:21 లూకా 2:21ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
- Philippians 3:5 ఫిలిప్పీయులకు 3:5ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,
- Luke 1:59 లూకా 1:59ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
- Exodus 12:48–49 నిర్గమకాండము 12:48–49నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
- John 7:22–23 యోహాను 7:22–23మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు. మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
- Acts 7:8 అపొస్తలుల కార్యములు 7:8మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
- Genesis 21:4 ఆదికాండము 21:4మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
- Genesis 17:23 ఆదికాండము 17:23అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను
- Romans 2:28 రోమీయులకు 2:28బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.
Original words (Hebrew)
- eight · H8083שְׁמֹנֶה shᵉmôneh
- days · H3117יוֹם yôwm
- old · H1121בֵּן bên
- circumcised · H4135מוּל mûwl
- child · H2145זָכָר zâkâr
- generations · H1755דּוֹר dôwr
- born · H3211יָלִיד yâlîyd
- house · H1004בַּיִת bayith
- bought · H4736מִקְנָה miqnâh
- money · H3701כֶּסֶף keçeph
- stranger · H1121בֵּן bên
- seed · H2233זֶרַע zeraʻ