Genesis · chapter 17 · verse 11
Genesis 17:11 in Telugu
మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
Meeru mee gopyaangacharmamuna sunnati pondavalenu. Adi naaku neeku madhyanunna nibandhanaku soochanagaa undunu.
Genesis 17:11 in English
- King James Version (KJV)
- And ye shall circumcise the flesh of your foreskin; and it shall be a token of the covenant betwixt me and you.
- World English Bible (WEB)
- You shall be circumcised in the flesh of your foreskin. It will be a token of the covenant between me and you.
- American Standard Version (ASV)
- And ye shall be circumcised in the flesh of your foreskin; and it shall be a token of a covenant betwixt me and you.
- Bible in Basic English (BBE)
- In the flesh of your private parts you are to undergo it, as a mark of the agreement between me and you.
- Darby Translation (DBY)
- And ye shall circumcise the flesh of your foreskin; and [that] shall be a sign of the covenant between me and you.
- Webster's Bible (WBS)
- And ye shall circumcise the flesh of your foreskin; and it shall be a token of the covenant betwixt me and you.
- Young's Literal Translation (YLT)
- and ye have circumcised the flesh of your foreskin, and it hath become a token of a covenant between Me and you.
Read in context
- 9మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను.
- 10నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
- 11మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
- 12ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
- 13నీ యింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.
Cross references
- Romans 4:11 రోమీయులకు 4:11మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
- Acts 7:8 అపొస్తలుల కార్యములు 7:8మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
- Deuteronomy 10:16 ద్వితీయోపదేశకాండము 10:16కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి
- Exodus 12:48 నిర్గమకాండము 12:48నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
- Exodus 4:25 నిర్గమకాండము 4:25సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.
- Joshua 5:3 యెహోషువ 5:3యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీ యులకు సున్నతి చేయించెను.
- 1 Samuel 18:25–27 1 సమూయేలు 18:25–27అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
- 2 Samuel 3:14 2 సమూయేలు 3:14మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా