Genesis · chapter 27 · verse 13
Genesis 27:13 in Telugu
అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
Ayinanu atani talli naa kumaarudaa, aa shaapamu naa meediki vachchunu gaaka. Neevu naa maata maatramu vini, poyi vaatini naayoddaku teesikoni rammani cheppagaa
Genesis 27:13 in English
- King James Version (KJV)
- And his mother said unto him, Upon me [be] thy curse, my son: only obey my voice, and go fetch me [them].
- World English Bible (WEB)
- His mother said to him, “Let your curse be on me, my son. Only obey my voice, and go get them for me.”
- American Standard Version (ASV)
- And his mother said unto him, Upon me be thy curse, my son; only obey my voice, and go fetch me them.
- Bible in Basic English (BBE)
- And his mother said, Let the curse be on me, my son: only do as I say, and go and get them for me.
- Darby Translation (DBY)
- And his mother said to him, On me [be] thy curse, my son! Only hearken to my voice, and go, fetch [them].
- Webster's Bible (WBS)
- And his mother said to him, upon me [be] thy curse, my son; only obey my voice, and go, bring them to me.
- Young's Literal Translation (YLT)
- and his mother saith to him, 'On me thy disesteem, my son; only hearken to my voice, and go, take for me.'
Read in context
- 11అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.
- 12ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను.
- 13అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
- 14అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను.
- 15మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
Cross references
- Matthew 27:25 మత్తయి 27:25అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
- 1 Samuel 25:24 1 సమూయేలు 25:24నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము;
- 2 Samuel 14:9 2 సమూయేలు 14:9అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహా సనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా
- Genesis 43:9 ఆదికాండము 43:9నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
- 1 Samuel 14:24–28 1 సమూయేలు 14:24–28నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అనిసౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి. జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.
- Genesis 25:33 ఆదికాండము 25:33యాకోబు - నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా
- Genesis 25:23 ఆదికాండము 25:23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
- 1 Samuel 14:36–45 1 సమూయేలు 14:36–45అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను. అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతానునా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- Genesis 27:8 ఆదికాండము 27:8కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.