Matthew · chapter 27 · verse 25
Matthew 27:25 in Telugu
అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
Anduku praja landaruvaani raktamu maa meedanu maa pillalameedanu undugaakaniri.
Matthew 27:25 in English
- King James Version (KJV)
- Then answered all the people, and said, His blood [be] on us, and on our children.
- World English Bible (WEB)
- All the people answered, “May his blood be on us and on our children!”
- American Standard Version (ASV)
- And all the people answered and said, His blood [be] on us, and on our children.
- Bible in Basic English (BBE)
- And all the people made answer and said, Let his blood be on us, and on our children.
- Darby Translation (DBY)
- And all the people answering said, His blood [be] on us and on our children.
- Webster's Bible (WBS)
- Then answered all the people, and said, His blood [be] on us, and on our children.
- Young's Literal Translation (YLT)
- and all the people answering said, 'His blood [is] upon us, and upon our children!'
Read in context
- 23అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
- 24పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
- 25అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
- 26అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- 27అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి.
Cross references
- Joshua 2:19 యెహోషువ 2:19నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.
- Acts 5:28 అపొస్తలుల కార్యములు 5:28ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.
- Acts 7:52 అపొస్తలుల కార్యములు 7:52మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
- 1 Thessalonians 2:15–16 1 థెస్సలొనీకయులకు 2:15–16ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.
- Deuteronomy 19:10 ద్వితీయోపదేశకాండము 19:10ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్య ముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.
- Matthew 23:30–37 మత్తయి 23:30–37మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
- Numbers 35:33 సంఖ్యాకాండము 35:33మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- Psalm 109:12–19 కీర్తనలు 109:12–19వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
- Hebrews 10:28–30 హెబ్రీయులకు 10:28–30ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.
- 1 Kings 2:32 1 రాజులు 2:32నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపి వేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.
- 2 Samuel 1:16 2 సమూయేలు 1:16నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
- Ezekiel 18:14–32 యెహెజ్కేలు 18:14–32అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహ ములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొను చున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రదుకును. పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది? నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియే గదా అతడు మరణమునొందును? మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.