Genesis · chapter 3 · verse 12
Genesis 3:12 in Telugu
అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.
Anduku aadaamu naato nundutaku neevu naakichchina ee streeye aa vrukshaphalamulu konni naa kiyyagaa nenu tintinanenu.
Genesis 3:12 in English
- King James Version (KJV)
- And the man said, The woman whom thou gavest [to be] with me, she gave me of the tree, and I did eat.
- World English Bible (WEB)
- The man said, “The woman whom you gave to be with me, she gave me fruit from the tree, and I ate it.”
- American Standard Version (ASV)
- And the man said, The woman whom thou gavest to be with me, she gave me of the tree, and I did eat.
- Bible in Basic English (BBE)
- And the man said, The woman whom you gave to be with me, she gave me the fruit of the tree and I took it.
- Darby Translation (DBY)
- And Man said, The woman, whom thou hast given [to be] with me, she gave me of the tree, and I ate.
- Webster's Bible (WBS)
- And the man said, The woman, whom thou gavest [to be] with me, she gave me of the tree, and I ate.
- Young's Literal Translation (YLT)
- and the man saith, 'The woman whom Thou didst place with me — she hath given to me of the tree — and I do eat.'
Read in context
- 10అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.
- 11అందుకాయన - నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
- 12అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.
- 13అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ - సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.
- 14అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు
Cross references
- Proverbs 28:13 సామెతలు 28:13అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
- James 1:13–15 యాకోబు 1:13–15దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
- Romans 10:3 రోమీయులకు 10:3ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
- Job 31:33 యోబు 31:33ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
- Luke 10:29 లూకా 10:29అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసునడి గెను.
- Proverbs 19:3 సామెతలు 19:3అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
- Genesis 2:20 ఆదికాండము 2:20అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.
- 1 Samuel 15:20–24 1 సమూయేలు 15:20–24అందుకు సౌలుఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా సౌలుజనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట లను మీరి పాపము తెచ్చుకొంటిని.
- Exodus 32:21–24 నిర్గమకాండము 32:21–24అప్పుడు మోషేనీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారుమాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి. అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.
- Genesis 2:18 ఆదికాండము 2:18మరియు దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.