Genesis · chapter 35 · verse 9
Genesis 35:9 in Telugu
యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.
Yaakobu paddanaraamunundi vachchuchundagaa devudu tirigi ataniki pratyakshamai atani naasheervadinchenu.
Genesis 35:9 in English
- King James Version (KJV)
- And God appeared unto Jacob again, when he came out of Padan-aram, and blessed him.
- World English Bible (WEB)
- God appeared to Jacob again, when he came from Paddan Aram, and blessed him.
- American Standard Version (ASV)
- And God appeared unto Jacob again, when he came from Paddan-aram, and blessed him.
- Bible in Basic English (BBE)
- Now when Jacob was on his way from Paddan-aram, God came to him again and, blessing him, said,
- Darby Translation (DBY)
- And God appeared to Jacob again after he had come from Padan-Aram, and blessed him.
- Webster's Bible (WBS)
- And God appeared to Jacob again when he came out of Padan-aram; and blessed him.
- Young's Literal Translation (YLT)
- And God appeareth unto Jacob again, in his coming from Padan-Aram, and blesseth him;
Read in context
- 7అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.
- 8రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను.
- 9యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.
- 10అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.
- 11మరియు దేవుడు - నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
Cross references
- Genesis 26:2 ఆదికాండము 26:2అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.
- Genesis 35:1 ఆదికాండము 35:1దేవుడు యాకోబుతో - నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా
- Genesis 18:1 ఆదికాండము 18:1మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
- Genesis 12:7 ఆదికాండము 12:7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
- Genesis 32:24–30 ఆదికాండము 32:24–30యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను. ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఆయన నీ పేరేమని యడుగగా అతడు - యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు - నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన - నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. యాకోబు - నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
- Jeremiah 31:3 యిర్మీయా 31:3చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
- Genesis 31:11–13 ఆదికాండము 31:11–13మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
- Genesis 32:1 ఆదికాండము 32:1యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
- Genesis 31:3 ఆదికాండము 31:3అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
- Genesis 17:1 ఆదికాండము 17:1అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
- Genesis 46:2–3 ఆదికాండము 46:2–3అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు - యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు - చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్పజనముగా చేసెదను.
- Genesis 48:3–4 ఆదికాండము 48:3–4యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.