Genesis · chapter 31 · verse 11
Genesis 31:11 in Telugu
మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
Mariyu aa svapnamandu devuni doota yaakoboo ani nannu piluvagaa chittamu prabhuvaa ani cheppitini.
Genesis 31:11 in English
- King James Version (KJV)
- And the angel of God spake unto me in a dream, [saying], Jacob: And I said, Here [am] I.
- World English Bible (WEB)
- The angel of God said to me in the dream, ‘Jacob,’ and I said, ‘Here I am.’
- American Standard Version (ASV)
- And the angel of God said unto me in the dream, Jacob: and I said, Here am I.
- Bible in Basic English (BBE)
- And in my dream the angel of the Lord said to me, Jacob: and I said, Here am I.
- Darby Translation (DBY)
- And the Angel of God said to me in a dream, Jacob! And I said, Here am I.
- Webster's Bible (WBS)
- And the angel of God spoke to me in a dream, [saying], Jacob: And I said, Here [am] I.
- Young's Literal Translation (YLT)
- and the messenger of God saith unto me in the dream, Jacob, and I say, Here [am] I.
Read in context
- 9అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
- 10మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.
- 11మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
- 12అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
- 13నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
Cross references
- Isaiah 58:9 యెషయా 58:9అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
- Genesis 31:13 ఆదికాండము 31:13నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
- Genesis 22:1 ఆదికాండము 22:1ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
- Exodus 3:4 నిర్గమకాండము 3:4దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
- 1 Samuel 3:8 1 సమూయేలు 3:8యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి
- 1 Samuel 3:6 1 సమూయేలు 3:6యెహోవా మరల సమూ యేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయిచిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.
- 1 Samuel 3:4 1 సమూయేలు 3:4యెహోవా సమూయేలును పిలిచెను. అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి
- Genesis 48:15–16 ఆదికాండము 48:15–16అతడు యోసేపును దీవించి - నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
- 1 Samuel 3:16 1 సమూయేలు 3:16అయితే ఏలీసమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.
- Genesis 18:17 ఆదికాండము 18:17అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
- Genesis 31:5 ఆదికాండము 31:5మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
- Genesis 18:1 ఆదికాండము 18:1మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.