Genesis · chapter 37 · verse 1
Genesis 37:1 in Telugu
యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.
Yaakobu tana tandri paradesha vaasiga undina kanaanu deshamulo nivasinchenu.
Genesis 37:1 in English
- King James Version (KJV)
- And Jacob dwelt in the land wherein his father was a stranger, in the land of Canaan.
- World English Bible (WEB)
- Jacob lived in the land of his father’s travels, in the land of Canaan.
- American Standard Version (ASV)
- And Jacob dwelt in the land of his father’s sojournings, in the land of Canaan.
- Bible in Basic English (BBE)
- Now Jacob was living in the land where his father had made a place for himself, in the land of Canaan.
- Darby Translation (DBY)
- And Jacob dwelt in the land where his father sojourned — in the land of Canaan.
- Webster's Bible (WBS)
- And Jacob dwelt in the land in which his father was a stranger, in the land of Canaan.
- Young's Literal Translation (YLT)
- And Jacob dwelleth in the land of his father's sojournings — in the land of Canaan.
Read in context
- 1యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.
- 2యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
- 3మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.
Cross references
- Genesis 17:8 ఆదికాండము 17:8నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
- Genesis 23:4 ఆదికాండము 23:4మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నుల యెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా
- Hebrews 11:9–16 హెబ్రీయులకు 11:9–16విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా? వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
- Genesis 28:4 ఆదికాండము 28:4ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను.
- Genesis 36:7 ఆదికాండము 36:7వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.