Genesis · chapter 37 · verse 2
Genesis 37:2 in Telugu
యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
Yaakobu vanshaavali yidi. Yosepu padunedendlavaadai tana sahodarulato kooda mandanu mepuchundenu. Atadu chinnavaadai tana tandri bhaaryalaina bilhaa kumaarula yoddanu jilpaa kumaarula yoddanu undenu. Appudu yosepu vaari chedutanamunu goorchina samaachaaramu vaari tandriyoddaku techchuchundu vaadu.
Genesis 37:2 in English
- King James Version (KJV)
- These [are] the generations of Jacob. Joseph, [being] seventeen years old, was feeding the flock with his brethren; and the lad [was] with the sons of Bilhah, and with the sons of Zilpah, his father’s wives: and Joseph brought unto his father their evil report.
- World English Bible (WEB)
- This is the history of the generations of Jacob. Joseph, being seventeen years old, was feeding the flock with his brothers. He was a boy with the sons of Bilhah and Zilpah, his father’s wives. Joseph brought an evil report of them to their father.
- American Standard Version (ASV)
- These are the generations of Jacob. Joseph, being seventeen years old, was feeding the flock with his brethren; and he was a lad with the sons of Bilhah, and with the sons of Zilpah, his father’s wives: and Joseph brought the evil report of them unto their father.
- Bible in Basic English (BBE)
- These are the generations of Jacob: Joseph, a boy seventeen years old, was looking after the flock, together with his brothers, the sons of Bilhah and Zilpah, his father's wives; and Joseph gave their father a bad account of them.
- Darby Translation (DBY)
- These are the generations of Jacob. Joseph, being seventeen years old, fed the flock with his brethren; and he was doing service with the sons of Bilhah, and with the sons of Zilpah, his father's wives. And Joseph brought to his father an evil report of them.
- Webster's Bible (WBS)
- These [are] the generations of Jacob. Joseph [being] seventeen years old, was feeding the flock with his brethren, and the lad [was] with the sons of Bilhah, and with the sons of Zilpah, his father's wives: and Joseph brought to his father their evil report.
- Young's Literal Translation (YLT)
- These [are] births of Jacob: Joseph, a son of seventeen years, hath been enjoying himself with his brethren among the flock, (and he [is] a youth,) with the sons of Bilhah, and with the sons of Zilpah, his father's wives, and Joseph bringeth in an account of their evil unto their father.
Read in context
- 1యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.
- 2యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
- 3మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.
- 4అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.
Cross references
- Genesis 35:25–26 ఆదికాండము 35:25–26రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
- Genesis 35:22 ఆదికాండము 35:22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
- 1 Samuel 2:22–24 1 సమూయేలు 2:22–24ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు.
- 1 Corinthians 11:18 1 కొరింథీయులకు 11:18మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
- 1 Corinthians 5:1 1 కొరింథీయులకు 5:1మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.
- 1 Corinthians 1:11 1 కొరింథీయులకు 1:11నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.
- Genesis 30:4 ఆదికాండము 30:4తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
- Genesis 30:9 ఆదికాండము 30:9లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
- Genesis 10:1 ఆదికాండము 10:1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- John 7:7 యోహాను 7:7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
- Genesis 6:9 ఆదికాండము 6:9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
- Genesis 2:4 ఆదికాండము 2:4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
Original words (Hebrew)
- generations · H8435תּוֹלְדָה tôwlᵉdâh
- Jacob · H3290יַעֲקֹב Yaʻăqôb
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- seventeen · H6240עָשָׂר ʻâsâr
- years · H8141שָׁנֶה shâneh
- old · H1121בֵּן bên
- feeding · H7462רָעָה râʻâh
- flock · H6629צֹאן tsôʼn
- brethren · H251אָח ʼâch
- lad · H5288נַעַר naʻar
- sons · H1121בֵּן bên
- Bilhah · H1090בִּלְהָה Bilhâh
- sons · H1121בֵּן bên
- Zilpah · H2153זִלְפָּה Zilpâh
- father’s · H1אָב ʼâb
- wives · H802אִשָּׁה ʼishshâh
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- brought · H935בּוֹא bôwʼ
- father · H1אָב ʼâb
- evil · H7451רַע raʻ
- report · H1681דִּבָּה dibbâh