Genesis · chapter 50 · verse 25
Genesis 50:25 in Telugu
మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
Mariyu yosepu devudu nishchayamugaa mimmunu choodavachchunu; appudu meeru naa yemukalanu ikkadanundi teesikoni povalenani cheppi ishraayelu kumaarulacheta pramaanamu cheyinchukonenu.
Genesis 50:25 in English
- King James Version (KJV)
- And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and ye shall carry up my bones from hence.
- World English Bible (WEB)
- Joseph took an oath from the children of Israel, saying, “God will surely visit you, and you shall carry up my bones from here.”
- American Standard Version (ASV)
- And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and ye shall carry up my bones from hence.
- Bible in Basic English (BBE)
- Then Joseph made the children of Israel take an oath, saying, God will certainly give effect to his word, and you are to take my bones away from here.
- Darby Translation (DBY)
- And Joseph took an oath of the children of Israel, saying, God will certainly visit you; and ye shall carry up my bones hence.
- Webster's Bible (WBS)
- And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and ye shall carry up my bones from hence.
- Young's Literal Translation (YLT)
- And Joseph causeth the sons of Israel to swear, saying, 'God doth certainly inspect you, and ye have brought up my bones from this [place].'
Read in context
- 23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- 24యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
- 25మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
- 26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
Cross references
- Joshua 24:32 యెహోషువ 24:32ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
- Exodus 13:19 నిర్గమకాండము 13:19మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
- Acts 7:16 అపొస్తలుల కార్యములు 7:16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
- Genesis 47:29–31 ఆదికాండము 47:29–31ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. అందుకతడు - నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు - నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
- Hebrews 11:22 హెబ్రీయులకు 11:22యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
- Genesis 50:5 ఆదికాండము 50:5నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి - ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.