Genesis · chapter 6 · verse 11
Genesis 6:11 in Telugu
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
Bhoolokamu devuni sannidhini chedipoyiyundenu; bhoolokamu balaatkaaramuto nindiyundenu.
Genesis 6:11 in English
- King James Version (KJV)
- The earth also was corrupt before God, and the earth was filled with violence.
- World English Bible (WEB)
- The earth was corrupt before God, and the earth was filled with violence.
- American Standard Version (ASV)
- And the earth was corrupt before God, and the earth was filled with violence.
- Bible in Basic English (BBE)
- And the earth was evil in God's eyes and full of violent ways.
- Darby Translation (DBY)
- And the earth was corrupt before God, and the earth was full of violence.
- Webster's Bible (WBS)
- The earth also was corrupt before God; and the earth was filled with violence.
- Young's Literal Translation (YLT)
- And the earth is corrupt before God, and the earth is filled [with] violence.
Read in context
- 9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
- 10షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
- 11భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
- 12దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
- 13దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
Cross references
- Ezekiel 8:17 యెహెజ్కేలు 8:17అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.
- Hosea 4:1–2 హోషేయ 4:1–2ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆల కించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. అబద్ధసాక్ష్యము పలు కుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.
- Habakkuk 2:8 హబక్కూకు 2:8బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.
- Romans 3:19 రోమీయులకు 3:19ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
- Romans 2:13 రోమీయులకు 2:13ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
- Ezekiel 28:16 యెహెజ్కేలు 28:16అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.
- Isaiah 60:18 యెషయా 60:18ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
- Psalm 11:5 కీర్తనలు 11:5యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు,
- Jeremiah 6:7 యిర్మీయా 6:7ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయు చున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.
- Psalm 55:9 కీర్తనలు 55:9పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
- Psalm 140:11 కీర్తనలు 140:11కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.
- Habakkuk 1:2 హబక్కూకు 1:2యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.