Habakkuk · chapter 1 · verse 2
Habakkuk 1:2 in Telugu
యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.
Yehovaa, nenu morrapettinanu neevennaallu aalakimpa kunduvu? Balaatkaaramu jaruguchunnadani nenu neeku morrapettinanu neevu rakshimpaka yunnaavu.
Habakkuk 1:2 in English
- King James Version (KJV)
- O LORD, how long shall I cry, and thou wilt not hear! [even] cry out unto thee [of] violence, and thou wilt not save!
- World English Bible (WEB)
- LORD, how long will I cry, and you will not hear? I cry out to you “Violence!” and will you not save?
- American Standard Version (ASV)
- O Jehovah, how long shall I cry, and thou wilt not hear? I cry out unto thee of violence, and thou wilt not save.
- Bible in Basic English (BBE)
- How long, O Lord, will your ears be shut to my voice? I make an outcry to you about violent behaviour, but you do not send salvation.
- Darby Translation (DBY)
- Jehovah, how long shall I cry and thou wilt not hear? I cry out unto thee, Violence! and thou dost not save.
- Webster's Bible (WBS)
- O LORD, how long shall I cry, and thou wilt not hear! [even] cry out to thee [of] violence, and thou wilt not save!
- Young's Literal Translation (YLT)
- Till when, O Jehovah, have I cried, And Thou dost not hear? I cry unto Thee — 'Violence,' and Thou dost not save.
Read in context
- 1ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
- 2యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.
- 3నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.
- 4అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.
Cross references
- Psalm 22:1–2 కీర్తనలు 22:1–2నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
- Psalm 13:1–2 కీర్తనలు 13:1–2యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
- Lamentations 3:8 విలాపవాక్యములు 3:8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
- Jeremiah 14:9 యిర్మీయా 14:9భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరుని వలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.
- Psalm 94:3 కీర్తనలు 94:3యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
- Revelation 6:10 ప్రకటన 6:10వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
- Psalm 74:9–10 కీర్తనలు 74:9–10సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?