Jeremiah · chapter 14 · verse 9
Jeremiah 14:9 in Telugu
భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరుని వలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.
Bhramasiyunnavaanivalenu rakshimpaleni shooruni valenu neevela unnaavu? Yehovaa, neevu maamadhya nunnaave; memu nee perupettabadinavaaramu; mammunu cheyyi viduvakumu.
Jeremiah 14:9 in English
- King James Version (KJV)
- Why shouldest thou be as a man astonied, as a mighty man [that] cannot save? yet thou, O LORD, [art] in the midst of us, and we are called by thy name; leave us not.
- World English Bible (WEB)
- Why should you be like a scared man, as a mighty man who can’t save? Yet you, LORD, are in the middle of us, and we are called by your name. Don’t leave us.
- American Standard Version (ASV)
- Why shouldest thou be as a man affrighted, as a mighty man that cannot save? Yet thou, O Jehovah, art in the midst of us, and we are called by thy name; leave us not.
- Bible in Basic English (BBE)
- Why are you like a man surprised, like a man of war who is not able to give help? but you, O Lord, are with us, and we are named by your name; do not go away from us.
- Darby Translation (DBY)
- Why wilt thou be as a man astonished, as a mighty man that cannot save? Yet thou, Jehovah, art in the midst of us, and we are called by thy name: leave us not.
- Webster's Bible (WBS)
- Why shouldst thou be as a man astonished, as a mighty man [that] cannot save? yet thou, O LORD, [art] in the midst of us, and we are called by thy name; leave us not.
- Young's Literal Translation (YLT)
- Why art Thou as one dumb? As a mighty one not able to save? And Thou [art] in our midst, O Jehovah, And Thy name over us is called, leave us not.
Read in context
- 7యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
- 8ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;
- 9భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరుని వలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.
- 10యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షించును.
- 11మరియు యెహోవా నాతో ఇట్లనెనువారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము.
Cross references
- Isaiah 59:1 యెషయా 59:1రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
- Isaiah 63:19 యెషయా 63:19నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతివిు నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతివిు.
- Numbers 14:15–16 సంఖ్యాకాండము 14:15–16కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
- Numbers 11:23 సంఖ్యాకాండము 11:23అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.
- Jeremiah 15:16 యిర్మీయా 15:16నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.
- Psalm 46:5 కీర్తనలు 46:5దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.
- 2 Corinthians 6:16 2 కొరింథీయులకు 6:16దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
- Daniel 9:18–19 దానియేలు 9:18–19నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
- Isaiah 50:1–2 యెషయా 50:1–2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.
- Exodus 29:45–46 నిర్గమకాండము 29:45–46నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
- Hebrews 13:5 హెబ్రీయులకు 13:5ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
- Psalm 44:23–26 కీర్తనలు 44:23–26ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.