Hebrews · chapter 9 · verse 4
Hebrews 9:4 in Telugu
అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు,, నిబంధన పలకలును ఉండెను.
Andulo suvarnadhoopaartiyu, antatanu bangaarurekulato taapabadina nibandhana mandasamunu undenu. Aa mandasamulo mannaagala bangaaru paatrayu, chigirinchina aharonu chetikarrayu,, nibandhana palakalunu undenu.
Hebrews 9:4 in English
- King James Version (KJV)
- Which had the golden censer, and the ark of the covenant overlaid round about with gold, wherein [was] the golden pot that had manna, and Aaron’s rod that budded, and the tables of the covenant;
- World English Bible (WEB)
- having a golden altar of incense and the ark of the covenant overlaid on all sides with gold, in which was a golden pot holding the manna, Aaron’s rod that budded, and the tablets of the covenant;
- American Standard Version (ASV)
- having a golden altar of incense, and the ark of the covenant overlaid round about with gold, wherein [was] a golden pot holding the manna, and Aaron’s rod that budded, and the tables of the covenant;
- Bible in Basic English (BBE)
- Having a vessel of gold in it for burning perfumes, and the ark of the agreement, which was covered with gold and which had in it a pot made of gold for the manna, and Aaron's rod which put out buds, and the stones with the writing of the agreement;
- Darby Translation (DBY)
- having a golden censer, and the ark of the covenant, covered round in every part with gold, in which [were] the golden pot that had the manna, and the rod of Aaron that had sprouted, and the tables of the covenant;
- Webster's Bible (WBS)
- Which had the golden censer, and the ark of the covenant overlaid around with gold, in which [was] the golden pot that had manna, and Aaron's rod that budded, and the tables of the covenant;
- Young's Literal Translation (YLT)
- having a golden censer, and the ark of the covenant overlaid all round about with gold, in which [is] the golden pot having the manna, and the rod of Aaron that budded, and the tables of the covenant,
Read in context
- 2ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.
- 3రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
- 4అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు,, నిబంధన పలకలును ఉండెను.
- 5దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.
- 6ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని
Cross references
- Numbers 17:10 సంఖ్యాకాండము 17:10అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.
- 2 Chronicles 5:10 2 దినవృత్తాంతములు 5:10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.
- Exodus 26:33 నిర్గమకాండము 26:33ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
- Exodus 40:3 నిర్గమకాండము 40:3అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
- Leviticus 16:12 లేవీయకాండము 16:12యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు
- Numbers 17:5 సంఖ్యాకాండము 17:5అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రా యేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.
- Exodus 16:32–34 నిర్గమకాండము 16:32–34మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
- Exodus 34:29 నిర్గమకాండము 34:29మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
- Exodus 40:20–21 నిర్గమకాండము 40:20–21మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
- 1 Kings 8:21 1 రాజులు 8:21అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశ ములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.
- Deuteronomy 10:2–5 ద్వితీయోపదేశకాండము 10:2–5నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని. ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
- 1 Kings 8:9 1 రాజులు 8:9ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
Original words (Greek)
- had · G2192ἔχω échō
- the · G2369θυμιαστήριον thymiastḗrion
- golden · G5552χρύσεος chrýseos
- censer · G2369θυμιαστήριον thymiastḗrion
- and · G2532καί kaí
- ark · G2787κιβωτός kibōtós
- covenant · G1242διαθήκη diathḗkē
- overlaid · G4028περικαλύπτω perikalýptō
- about · G3840πάντοθεν pántothen
- gold · G5553χρυσίον chrysíon
- where · G3739ὅς hós
- in · G1722ἐν en
- the · G4713στάμνος stámnos
- golden · G5552χρύσεος chrýseos
- pot · G4713στάμνος stámnos
- had · G2192ἔχω échō
- manna · G3131μάννα mánna
- and · G2532καί kaí
- Aaron’s · G2Ἀαρών Aarṓn
- rod · G4464ῥάβδος rhábdos
- budded · G985βλαστάνω blastánō
- and · G2532καί kaí
- tables · G4109πλάξ pláx
- covenant · G1242διαθήκη diathḗkē