Hebrews · chapter 9 · verse 3
Hebrews 9:3 in Telugu
రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
Rendava teraku aavala atiparishuddhasthalamanu gudaaramundenu.
Hebrews 9:3 in English
- King James Version (KJV)
- And after the second veil, the tabernacle which is called the Holiest of all;
- World English Bible (WEB)
- After the second veil was the tabernacle which is called the Holy of Holies,
- American Standard Version (ASV)
- And after the second veil, the tabernacle which is called the Holy of holies;
- Bible in Basic English (BBE)
- And inside the second veil was the place which is named the Holy of holies;
- Darby Translation (DBY)
- but after the second veil a tabernacle which is called Holy of holies,
- Webster's Bible (WBS)
- And after the second vail, the tabernacle which is called the Holiest of all;
- Young's Literal Translation (YLT)
- and after the second vail a tabernacle that is called 'Holy of holies,'
Read in context
- 1మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.
- 2ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.
- 3రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
- 4అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు,, నిబంధన పలకలును ఉండెను.
- 5దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.
Cross references
- Exodus 26:31–33 నిర్గమకాండము 26:31–33మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
- Exodus 40:21 నిర్గమకాండము 40:21మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
- Exodus 40:3 నిర్గమకాండము 40:3అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
- Matthew 27:51 మత్తయి 27:51అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
- Hebrews 9:8 హెబ్రీయులకు 9:8దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయు చున్నాడు.
- 1 Kings 8:6 1 రాజులు 8:6మరియు యాజకులు యెహోవానిబంధన మందస మును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్బా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి.
- Hebrews 10:19–20 హెబ్రీయులకు 10:19–20సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,
- Hebrews 6:19 హెబ్రీయులకు 6:19ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
- 2 Chronicles 3:14 2 దినవృత్తాంతములు 3:14అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.
- Isaiah 25:7 యెషయా 25:7సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
- Exodus 36:35–38 నిర్గమకాండము 36:35–38మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను. దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.