Hosea · chapter 2 · verse 11
Hosea 2:11 in Telugu
దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును.
Daani utsavakaalamulanu pandugalanu amaavaasyalanu vishraanti dinamulanu niyaamakakaalamulanu maanpintunu.
Hosea 2:11 in English
- King James Version (KJV)
- I will also cause all her mirth to cease, her feast days, her new moons, and her sabbaths, and all her solemn feasts.
- World English Bible (WEB)
- I will also cause all her celebrations to cease: her feasts, her new moons, her Sabbaths, and all her solemn assemblies.
- American Standard Version (ASV)
- I will also cause all her mirth to cease, her feasts, her new moons, and her sabbaths, and all her solemn assemblies.
- Bible in Basic English (BBE)
- And I will put an end to all her joy, her feasts, her new moons, and her Sabbaths, and all her regular meetings.
- Darby Translation (DBY)
- And I will cause all her mirth to cease: her feasts, her new moons, and her sabbaths! and all her solemnities.
- Webster's Bible (WBS)
- I will also cause all her mirth to cease, her feast days, her new moons, and her sabbaths, and all her solemn feasts.
- Young's Literal Translation (YLT)
- And I have caused to cease all her joy, Her festival, her new moon, and her sabbath, Even all her appointed times,
Read in context
- 9కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షా రసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును;
- 10దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.
- 11దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును.
- 12ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును.
- 13అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.
Cross references
- Isaiah 1:13–14 యెషయా 1:13–14మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
- Amos 5:21 ఆమోసు 5:21మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.
- Amos 8:5 ఆమోసు 8:5తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,
- Jeremiah 16:9 యిర్మీయా 16:9సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను.
- Jeremiah 7:34 యిర్మీయా 7:34ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
- Revelation 18:22–23 ప్రకటన 18:22–23నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
- Hosea 3:4 హోషేయ 3:4నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.
- Amos 8:9–10 ఆమోసు 8:9–10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Isaiah 24:7–11 యెషయా 24:7–11క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
- Nahum 1:10 నహూము 1:10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
- 1 Kings 12:32 1 రాజులు 12:32మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
- Jeremiah 25:10 యిర్మీయా 25:10సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.