Hosea · chapter 7 · verse 11
Hosea 7:11 in Telugu
ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
Ephraayimu buddhileni pirikigundegala guvvayaayenu; vaaru aigupteeyulanu piluchukonduru. Ashshooreeyula yoddaku povuduru.
Hosea 7:11 in English
- King James Version (KJV)
- Ephraim also is like a silly dove without heart: they call to Egypt, they go to Assyria.
- World English Bible (WEB)
- “Ephraim is like an easily deceived dove, without understanding. They call to Egypt. They go to Assyria.
- American Standard Version (ASV)
- And Ephraim is like a silly dove, without understanding: they call unto Egypt, they go to Assyria.
- Bible in Basic English (BBE)
- And Ephraim is like a foolish dove, without wisdom; they send out their cry to Egypt, they go to Assyria.
- Darby Translation (DBY)
- And Ephraim is become like a silly dove without understanding: they call to Egypt, they go to Assyria.
- Webster's Bible (WBS)
- Ephraim also is like a silly dove without heart: they call to Egypt, they go to Assyria.
- Young's Literal Translation (YLT)
- And Ephraim is as a simple dove without heart, Egypt they called on — [to] Asshur they have gone.
Read in context
- 9అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.
- 10ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.
- 11ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
- 12వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.
- 13వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్దములు చెప్పుదురు
Cross references
- Hosea 5:13 హోషేయ 5:13తాను రోగియవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.
- Hosea 12:1 హోషేయ 12:1ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.
- Hosea 11:11 హోషేయ 11:11వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.
- Hosea 4:11 హోషేయ 4:11వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి.
- Jeremiah 2:18 యిర్మీయా 2:18నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.
- Hosea 9:3 హోషేయ 9:3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
- Proverbs 6:32 సామెతలు 6:32జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
- Hosea 14:3 హోషేయ 14:3అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
- 2 Kings 15:19 2 రాజులు 15:19అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.
- Isaiah 30:1–6 యెషయా 30:1–6యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.
- Isaiah 31:1–3 యెషయా 31:1–3ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
- Ezekiel 23:4–8 యెహెజ్కేలు 23:4–8వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను. అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.