Hosea · chapter 9 · verse 3
Hosea 9:3 in Telugu
ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
Ephraayimeeyulu aiguptu naku maraluduru, ashshooru deshamulo vaaru apavitra maina vaatini tinduru, yehovaa deshamulo vaaru nivasimpakoodadu.
Hosea 9:3 in English
- King James Version (KJV)
- They shall not dwell in the LORD’s land; but Ephraim shall return to Egypt, and they shall eat unclean [things] in Assyria.
- World English Bible (WEB)
- They won’t dwell in the LORD’s land; but Ephraim will return to Egypt, and they will eat unclean food in Assyria.
- American Standard Version (ASV)
- They shall not dwell in Jehovah’s land; but Ephraim shall return to Egypt, and they shall eat unclean food in Assyria.
- Bible in Basic English (BBE)
- They will have no resting-place in the Lord's land, but Ephraim will go back to Egypt, and they will take unclean food in Assyria.
- Darby Translation (DBY)
- They shall not dwell in Jehovah's land; but Ephraim shall return to Egypt, and in Assyria shall they eat that which is unclean.
- Webster's Bible (WBS)
- They shall not dwell in the LORD'S land; but Ephraim shall return to Egypt, and they shall eat unclean [things] in Assyria.
- Young's Literal Translation (YLT)
- They do not abide in the land of Jehovah, And turned back hath Ephraim [to] Egypt, And in Asshur an unclean thing they eat.
Read in context
- 1ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
- 2కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.
- 3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
- 4యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.
- 5నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు?
Cross references
- Ezekiel 4:13 యెహెజ్కేలు 4:13నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
- Hosea 8:13 హోషేయ 8:13నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.
- Leviticus 25:23 లేవీయకాండము 25:23భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
- Jeremiah 2:7 యిర్మీయా 2:7దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.
- Hosea 7:11 హోషేయ 7:11ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
- Jeremiah 16:18 యిర్మీయా 16:18వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.
- 2 Kings 17:6 2 రాజులు 17:6హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.
- Joshua 23:15 యెహోషువ 23:15అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును.
- Daniel 1:8 దానియేలు 1:8రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా
- 1 Kings 9:7 1 రాజులు 9:7నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
- Hosea 9:6 హోషేయ 9:6లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.
- Deuteronomy 4:26 ద్వితీయోపదేశకాండము 4:26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వర లోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.