Isaiah · chapter 31 · verse 1
Isaiah 31:1 in Telugu
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
Ishraayelu parishuddhadevuni lakshyapettakayu yehovaayodda vichaarimpakayu sahaayamu nimittamu aiguptunaku velluchu gurramulanu aadhaaramu chesikoni vaari rathamulu vistaaramulaniyu rautulu balaadhyulaniyu vaarini aashrayinchuvaariki shrama.
Isaiah 31:1 in English
- King James Version (KJV)
- Woe to them that go down to Egypt for help; and stay on horses, and trust in chariots, because [they are] many; and in horsemen, because they are very strong; but they look not unto the Holy One of Israel, neither seek the LORD!
- World English Bible (WEB)
- Woe to those who go down to Egypt for help, and rely on horses, and trust in chariots because they are many, and in horsemen because they are very strong, but they don’t look to the Holy One of Israel, and they don’t seek the LORD!
- American Standard Version (ASV)
- Woe to them that go down to Egypt for help, and rely on horses, and trust in chariots because they are many, and in horsemen because they are very strong, but they look not unto the Holy One of Israel, neither seek Jehovah!
- Bible in Basic English (BBE)
- Cursed are those who go down to Egypt for help, and who put their faith in horses; looking to war-carriages for salvation, because of their numbers; and to horsemen, because they are very strong; but they are not looking to the Holy One of Israel, or turning their hearts to the Lord;
- Darby Translation (DBY)
- Woe to them that go down to Egypt for help, and depend on horses, and confide in chariots because [they are] many, and in horsemen because they are very strong; and who look not unto the Holy One of Israel, neither seek Jehovah!
- Webster's Bible (WBS)
- Woe to them that go down to Egypt for help; and rely on horses, and trust in chariots, because [they are] many; and in horsemen, because they are very strong; but they look not to the Holy One of Israel, neither seek the LORD!
- Young's Literal Translation (YLT)
- Woe [to] those going down to Egypt for help, And on horses lean, And trust on chariots, because many, And on horsemen, because very strong, And have not looked on the Holy One of Israel, And Jehovah have not sought.
Read in context
- 1ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
- 2అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.
- 3ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.
Cross references
- Psalm 20:7 కీర్తనలు 20:7కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
- Jeremiah 17:5 యిర్మీయా 17:5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
- Deuteronomy 17:16 ద్వితీయోపదేశకాండము 17:16అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవాఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.
- Jeremiah 2:13 యిర్మీయా 2:13నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
- Isaiah 36:9 యెషయా 36:9లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.
- Daniel 9:13 దానియేలు 9:13మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.
- Psalm 33:16–17 కీర్తనలు 33:16–17ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.
- Isaiah 30:16 యెషయా 30:16అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.
- Amos 5:4–8 ఆమోసు 5:4–8ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్‌గా లులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును. న్యాయమును అన్యాయ మునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా, ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
- Isaiah 30:1–7 యెషయా 30:1–7యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు. ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.
- Isaiah 36:6 యెషయా 36:6నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.
- Hosea 14:3 హోషేయ 14:3అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
Original words (Hebrew)
- Woe · H1945הוֹי hôwy
- down · H3381יָרַד yârad
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- help · H5833עֶזְרָה ʻezrâh
- stay · H8172שָׁעַן shâʻan
- horses · H5483סוּס çûwç
- trust · H982בָּטַח bâṭach
- chariots · H7393רֶכֶב rekeb
- many · H7227רַב rab
- horsemen · H6571פָּרָשׁ pârâsh
- very · H3966מְאֹד mᵉʼôd
- strong · H6105עָצַם ʻâtsam
- look · H8159שָׁעָה shâʻâh
- One · H6918קָדוֹשׁ qâdôwsh
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- seek · H1875דָּרַשׁ dârash