Isaiah · chapter 13 · verse 4
Isaiah 13:4 in Telugu
బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
Bahujanulaghoshavale kondalaloni janasamoohamu valana kalugu shabdamu vinudi koodukonu raajyamula janamulu cheyu allari shabdamu vinudi sainyamula kadhipatiyagu yehovaa yuddhamunakai tana senanu vyoohakramamugaa erparachuchunnaadu
Isaiah 13:4 in English
- King James Version (KJV)
- The noise of a multitude in the mountains, like as of a great people; a tumultuous noise of the kingdoms of nations gathered together: the LORD of hosts mustereth the host of the battle.
- World English Bible (WEB)
- The noise of a multitude is in the mountains, as of a great people; the noise of an uproar of the kingdoms of the nations gathered together! The LORD of Armies is mustering the army for the battle.
- American Standard Version (ASV)
- The noise of a multitude in the mountains, as of a great people! the noise of a tumult of the kingdoms of the nations gathered together! Jehovah of hosts is mustering the host for the battle.
- Bible in Basic English (BBE)
- The noise of great numbers in the mountains, like the noise of a strong people! The noise of the kingdoms of the nations meeting together! The Lord of armies is numbering his forces for war.
- Darby Translation (DBY)
- The noise of a multitude on the mountains, as of a great people; a tumultuous noise of the kingdoms of nations assembled together: Jehovah of hosts mustereth the host of the battle.
- Webster's Bible (WBS)
- The noise of a multitude in the mountains, as of a great people; a tumultuous noise of the kingdoms of nations assembled: the LORD of hosts mustereth the host of the battle.
- Young's Literal Translation (YLT)
- A voice of a multitude in the mountains, A likeness of a numerous people, A voice of noise from the kingdoms of nations who are gathered, Jehovah of Hosts inspecting a host of battle!
Read in context
- 2జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.
- 3నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను.
- 4బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
- 5సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.
- 6యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
Cross references
- Joel 3:14 యోవేలు 3:14తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
- Ezekiel 38:3–23 యెహెజ్కేలు 38:3–23ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను. నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కు లలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును. నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండ వలెను. చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించు కొని, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు. గాలి వాన వచ్చి నట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును, నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను. సెబావారును దదానువా రును తర్షీషు వర్తకులును కొదమసింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచిసొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చి తివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్ల నుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా? ఉత్తర దిక్కున దూర ముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనములనేకములును గుఱ్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వ మందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చి నదే గదా? ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.
- Joel 2:1–11 యోవేలు 2:1–11సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
- Revelation 19:11–21 ప్రకటన 19:11–21మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- Joel 2:25 యోవేలు 2:25మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
- Jeremiah 50:14–15 యిర్మీయా 50:14–15ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.
- Jeremiah 51:6–25 యిర్మీయా 51:6–25మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితివిు అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది యెహోవా మన న్యాయమును రుజువు పరచుచున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు. విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు. గొంగిళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయుదురు నా జీవముతోడని సైన్యముల కధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును. తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు చున్నాను. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కి టెద్దులను విరుగ గొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
- Isaiah 22:1–9 యెషయా 22:1–9దర్శనపులోయను గూర్చిన దేవోక్తి ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరుడాలు పై గవిసెన తీసెను అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు. అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.
- Jeremiah 50:21–46 యిర్మీయా 50:21–46దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. కావున ఆ దినమున దాని ¸యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును. యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు. జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
- Jeremiah 51:27–28 యిర్మీయా 51:27–28దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి. దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి
- Revelation 9:7–19 ప్రకటన 9:7–19ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి, స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను. మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి. గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను, ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.
- Zechariah 14:13–14 జెకర్యా 14:13–14ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.
Original words (Hebrew)
- noise · H6963קוֹל qôwl
- multitude · H1995הָמוֹן hâmôwn
- mountains · H2022הַר har
- as · H1823דְּמוּת dᵉmûwth
- great · H7227רַב rab
- people · H5971עַם ʻam
- tumultuous · H7588שָׁאוֹן shâʼôwn
- noise · H6963קוֹל qôwl
- kingdoms · H4467מַמְלָכָה mamlâkâh
- nations · H1471גּוֹי gôwy
- together · H622אָסַף ʼâçaph
- hosts · H6635צָבָא tsâbâʼ
- mustereth · H6485פָּקַד pâqad
- host · H6635צָבָא tsâbâʼ
- battle · H4421מִלְחָמָה milchâmâh