Isaiah · chapter 13 · verse 8
Isaiah 13:8 in Telugu
జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
Janulu vibhraantinonduduru vedanalu duhkhamulu vaariki kalugunu prasavavedana padudaanivale vaaru vedanapadedaru okarinokaru teri chooturu vaari mukhamulu jvaalalavale errabaarunu.
Isaiah 13:8 in English
- King James Version (KJV)
- And they shall be afraid: pangs and sorrows shall take hold of them; they shall be in pain as a woman that travaileth: they shall be amazed one at another; their faces [shall be as] flames.
- World English Bible (WEB)
- They will be dismayed. Pangs and sorrows will seize them. They will be in pain like a woman in labor. They will look in amazement one at another. Their faces will be faces of flame.
- American Standard Version (ASV)
- and they shall be dismayed; pangs and sorrows shall take hold [of them]; they shall be in pain as a woman in travail: they shall look in amazement one at another; their faces [shall be] faces of flame.
- Bible in Basic English (BBE)
- Their hearts will be full of fear; pains and sorrows will overcome them; they will be in pain like a woman in childbirth; they will be shocked at one another; their faces will be like flames.
- Darby Translation (DBY)
- and they shall be terrified: pangs and sorrows shall take hold of them, they shall writhe as a woman that travaileth; they shall be amazed one at another, their faces shall be as flames.
- Webster's Bible (WBS)
- And they shall be afraid: pangs and sorrows shall take hold of them; they shall be in pain as a woman that travaileth: they shall be amazed one at another; their faces [shall be as] flames.
- Young's Literal Translation (YLT)
- And they have been troubled, Pains and pangs they take, As a travailing woman they are pained, A man at his friend they marvel, The appearance of flames — their faces!
Read in context
- 6యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
- 7అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
- 8జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
- 9యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.
- 10ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
Cross references
- 1 Thessalonians 5:3 1 థెస్సలొనీకయులకు 5:3లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
- Isaiah 26:17 యెషయా 26:17యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.
- Nahum 2:10 నహూము 2:10అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
- Isaiah 21:3–4 యెషయా 21:3–4కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
- John 16:21 యోహాను 16:21స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.
- Jeremiah 30:6 యిర్మీయా 30:6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
- Jeremiah 50:43 యిర్మీయా 50:43బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.
- Daniel 5:5–6 దానియేలు 5:5–6ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.
- Jeremiah 4:31 యిర్మీయా 4:31ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
- Joel 2:6 యోవేలు 2:6వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.
- Psalm 48:5–6 కీర్తనలు 48:5–6వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి. వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.