Isaiah · chapter 16 · verse 2
Isaiah 16:2 in Telugu
గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు.
Gootinundi chedari itu atu eguru pakshulavale arnonu revulayodda moyaabu kumaartelu kana baduduru.
Isaiah 16:2 in English
- King James Version (KJV)
- For it shall be, [that], as a wandering bird cast out of the nest, [so] the daughters of Moab shall be at the fords of Arnon.
- World English Bible (WEB)
- For it will be that as wandering birds, as a scattered nest, so will the daughters of Moab be at the fords of the Arnon.
- American Standard Version (ASV)
- For it shall be that, as wandering birds, as a scattered nest, so shall the daughters of Moab be at the fords of the Arnon.
- Bible in Basic English (BBE)
- For the daughters of Moab will be like wandering birds, like a place from which the young birds have gone in flight, at the ways across the Arnon.
- Darby Translation (DBY)
- And it shall be [that] as a wandering bird, [as] a scattered nest, so shall the daughters of Moab be at the fords of the Arnon.
- Webster's Bible (WBS)
- For it shall be, [that] , as a wandering bird cast out of the nest, [so] the daughters of Moab shall be at the fords of Arnon.
- Young's Literal Translation (YLT)
- And it hath come to pass, As a wandering bird, a nest cast out, Are daughters of Moab, [at] fords of Arnon.
Read in context
- 1అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా సీయోను కుమార్తె పర్వతమునకు పంపుడి
- 2గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు.
- 3ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పట్టియ్యకుము
- 4నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా బీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని పోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండ నశించిరి.
Cross references
- Proverbs 27:8 సామెతలు 27:8తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
- Judges 11:18 న్యాయాధిపతులు 11:18తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.
- Numbers 21:13–15 సంఖ్యాకాండము 21:13–15అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీ యులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.
- Deuteronomy 3:12 ద్వితీయోపదేశకాండము 3:12అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశ మును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.
- Deuteronomy 3:8 ద్వితీయోపదేశకాండము 3:8ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.
- Deuteronomy 2:36 ద్వితీయోపదేశకాండము 2:36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
- Joshua 13:16 యెహోషువ 13:16వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
- Isaiah 13:14 యెషయా 13:14అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.
- Jeremiah 48:20 యిర్మీయా 48:20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి