Jeremiah · chapter 48 · verse 20
Jeremiah 48:20 in Telugu
మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
Moyaabu padagottabadinadai avamaanamu nondi yunnadi golayetti kekaluveyumu moyaabu apajayamu nondenu. Arnonulo ee sangati teliyajeppudi
Jeremiah 48:20 in English
- King James Version (KJV)
- Moab is confounded; for it is broken down: howl and cry; tell ye it in Arnon, that Moab is spoiled,
- World English Bible (WEB)
- Moab is disappointed; for it is broken down. Wail and cry! Tell it by the Arnon, that Moab is laid waste.
- American Standard Version (ASV)
- Moab is put to shame; for it is broken down: wail and cry; tell ye it by the Arnon, that Moab is laid waste.
- Bible in Basic English (BBE)
- Moab has been put to shame, she is broken: make loud sounds of grief, crying out for help; give the news in Arnon, that Moab has been made waste.
- Darby Translation (DBY)
- Moab is put to shame; for he is broken down: howl and cry; tell it in Arnon, that Moab is laid waste.
- Webster's Bible (WBS)
- Moab is confounded; for it is broken down: howl and cry; tell ye it in Arnon, that Moab is laid waste.
- Young's Literal Translation (YLT)
- Put to shame hath been Moab, For it hath been broken down, Howl and cry, declare ye in Arnon, For spoiled is Moab,
Read in context
- 18దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
- 19ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
- 20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
- 21మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
- 22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
Cross references
- Isaiah 16:2 యెషయా 16:2గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు.
- Numbers 21:26–28 సంఖ్యాకాండము 21:26–28హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
- Judges 11:18 న్యాయాధిపతులు 11:18తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.
- Isaiah 15:8 యెషయా 15:8రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.
- Isaiah 15:1–5 యెషయా 15:1–5మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.
- Numbers 21:13–14 సంఖ్యాకాండము 21:13–14అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీ యులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
- Joshua 13:9 యెహోషువ 13:9అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు
- Deuteronomy 2:36 ద్వితీయోపదేశకాండము 2:36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
- Jeremiah 48:1–5 యిర్మీయా 48:1–5మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది. మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
- Isaiah 16:7–11 యెషయా 16:7–11కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగ లార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికిప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి.