Isaiah · chapter 29 · verse 20
Isaiah 29:20 in Telugu
బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
Balaatkaarulu lekapovuduru parihaasakulu nashinchedaru.
Isaiah 29:20 in English
- King James Version (KJV)
- For the terrible one is brought to nought, and the scorner is consumed, and all that watch for iniquity are cut off:
- World English Bible (WEB)
- For the ruthless is brought to nothing, and the scoffer ceases, and all those who are alert to do evil are cut off—
- American Standard Version (ASV)
- For the terrible one is brought to nought, and the scoffer ceaseth, and all they that watch for iniquity are cut off;
- Bible in Basic English (BBE)
- For the cruel one has come to nothing; and those who make sport of the Lord are gone; and those who are watching to do evil are cut off:
- Darby Translation (DBY)
- For the terrible one shall come to nought, and the scorner shall be no more, and all that watch for iniquity shall be cut off,
- Webster's Bible (WBS)
- For the terrible one is brought to naught, and the scoffer is consumed, and all that watch for iniquity are cut off:
- Young's Literal Translation (YLT)
- For ceased hath the terrible one, And consumed hath been the scorner, And cut off have been all watching for iniquity,
Read in context
- 18ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
- 19యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.
- 20బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
- 21కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
- 22అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
Cross references
- Micah 2:1 మీకా 2:1మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
- Isaiah 28:14–22 యెషయా 28:14–22కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు వదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటు నప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
- Isaiah 59:4 యెషయా 59:4నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
- Isaiah 29:5 యెషయా 29:5నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.
- Luke 16:14 లూకా 16:14ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా
- Isaiah 13:3 యెషయా 13:3నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి యున్నాను.
- Revelation 12:10 ప్రకటన 12:10మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
- Isaiah 25:4–5 యెషయా 25:4–5కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
- Luke 6:7 లూకా 6:7శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి;
- Luke 20:20–23 లూకా 20:20–23వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. వారు వచ్చిబోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచు నున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగు దుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి.
- Daniel 7:19–25 దానియేలు 7:19–25ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని. నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును. ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును. ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
- Daniel 7:7 దానియేలు 7:7పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.