Isaiah · chapter 29 · verse 21
Isaiah 29:21 in Telugu
కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
Keeducheya yatninchuchu okka vyaajyemunu batti yitarulanu paapulanugaa cheyuchu gummamulo tammunu gaddinchuvaanini pattukonavalenani uri nodduchu maayamaatalacheta neetimantuni padadroyuvaaru narakabaduduru.
Isaiah 29:21 in English
- King James Version (KJV)
- That make a man an offender for a word, and lay a snare for him that reproveth in the gate, and turn aside the just for a thing of nought.
- World English Bible (WEB)
- who cause a person to be indicted by a word, and lay a snare for one who reproves in the gate, and who deprive the innocent of justice with false testimony.
- American Standard Version (ASV)
- that make a man an offender in [his] cause, and lay a snare for him that reproveth in the gate, and turn aside the just with a thing of nought.
- Bible in Basic English (BBE)
- Who give help to a man in a wrong cause, and who put a net for the feet of him who gives decisions in the public place, taking away a man's right without cause.
- Darby Translation (DBY)
- that make a man an offender for a word, and lay a snare for him that reproveth in the gate, and pervert [the judgment of] the righteous by futility.
- Webster's Bible (WBS)
- That make a man an offender for a word, and lay a snare for him that reproveth in the gate, and turn aside the just for a thing of naught.
- Young's Literal Translation (YLT)
- Causing men to sin in word, And for a reprover in the gate lay a snare, And turn aside into emptiness the righteous.
Read in context
- 19యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.
- 20బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
- 21కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
- 22అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
- 23అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.
Cross references
- Amos 5:10–12 ఆమోసు 5:10–12అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
- James 5:6 యాకోబు 5:6మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.
- Acts 3:14 అపొస్తలుల కార్యములు 3:14మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
- Judges 12:6 న్యాయాధిపతులు 12:6అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.
- Matthew 26:15 మత్తయి 26:15నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Jeremiah 20:7–10 యిర్మీయా 20:7–10యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే పణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతు వాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.
- Ezekiel 13:19 యెహెజ్కేలు 13:19అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.
- Micah 2:6–7 మీకా 2:6–7మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
- Amos 7:10–17 ఆమోసు 7:10–17అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యరొబామునకు వర్తమానము పంపిఇశ్రా యేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయు చున్నాడు; యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము; బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయ కూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచినీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెల విచ్చెను. యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చునదేమన గానీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.
- Isaiah 32:7 యెషయా 32:7మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
- Proverbs 28:21 సామెతలు 28:21పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.