Isaiah · chapter 30 · verse 29
Isaiah 30:29 in Telugu
రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.
Raatriyandu panduga naacharinchunatlugaa meeru sangeetamu paaduduru. Ishraayelunaku aashrayadurgamaina yehovaayokka parvatamunaku pillanagrovi naadamuto prayaanamu cheyuvaariki kalugunatti hrudayasantoshamu kalugunu.
Isaiah 30:29 in English
- King James Version (KJV)
- Ye shall have a song, as in the night [when] a holy solemnity is kept; and gladness of heart, as when one goeth with a pipe to come into the mountain of the LORD, to the mighty One of Israel.
- World English Bible (WEB)
- You will have a song, as in the night when a holy feast is kept, and gladness of heart, as when one goes with a flute to come to the LORD’s mountain, to Israel’s Rock.
- American Standard Version (ASV)
- Ye shall have a song as in the night when a holy feast is kept; and gladness of heart, as when one goeth with a pipe to come unto the mountain of Jehovah, to the Rock of Israel.
- Bible in Basic English (BBE)
- You will have a song, as in the night when a holy feast is kept; and you will be glad in heart, as when they go with music of the pipe to the mountain of the Lord, the Rock of Israel.
- Darby Translation (DBY)
- Ye shall have a song, as in the night when a feast is sanctified; and joy of heart, as of one who goeth with a pipe to come unto the mountain of Jehovah, to the Rock of Israel.
- Webster's Bible (WBS)
- Ye shall have a song, as in the night, [when] a holy solemnity is kept; and gladness of heart, as when one goeth with a pipe to come upon the mountain of the LORD, to the mighty One of Israel.
- Young's Literal Translation (YLT)
- Singing is to you as in a night sanctified for a festival, And joy of heart as he who is going with a pipe, To go in to the mountain of Jehovah, Unto the rock of Israel.
Read in context
- 27ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.
- 28ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.
- 29రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.
- 30యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
- 31యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.
Cross references
- Psalm 42:4 కీర్తనలు 42:4జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
- Psalm 95:1–2 కీర్తనలు 95:1–2రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- Exodus 15:1–21 నిర్గమకాండము 15:1–21అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి - యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధికభయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
- Revelation 15:3 ప్రకటన 15:3వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Matthew 26:30 మత్తయి 26:30అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.
- Isaiah 26:4 యెషయా 26:4యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
- Deuteronomy 16:6 ద్వితీయోపదేశకాండము 16:6నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి
- Psalm 81:1–4 కీర్తనలు 81:1–4మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.
- Isaiah 2:3 యెషయా 2:3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
- Deuteronomy 32:4 ద్వితీయోపదేశకాండము 32:4ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
- Jeremiah 19:1–7 యిర్మీయా 19:1–7యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీ విట్లనుము - యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసి యున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదా రాజు లైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు. తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.
- Psalm 32:7 కీర్తనలు 32:7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
Original words (Hebrew)
- song · H7892שִׁיר shîyr
- night · H3915לַיִל layil
- holy · H6942קָדַשׁ qâdash
- solemnity · H2282חַג chag
- kept · H6942קָדַשׁ qâdash
- gladness · H8057שִׂמְחָה simchâh
- heart · H3824לֵבָב lêbâb
- goeth · H1980הָלַךְ hâlak
- pipe · H2485חָלִיל châlîyl
- come · H935בּוֹא bôwʼ
- mountain · H2022הַר har
- One · H6697צוּר tsûwr
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl