Psalms · chapter 33 · verse 16
Psalm 33:16 in Telugu
ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
E raajunu senaabalamucheta rakshimpabadadu e veerudunu adhikabalamucheta tappinchukonadu.
Psalm 33:16 in English
- King James Version (KJV)
- There is no king saved by the multitude of an host: a mighty man is not delivered by much strength.
- World English Bible (WEB)
- There is no king saved by the multitude of an army. A mighty man is not delivered by great strength.
- American Standard Version (ASV)
- There is no king saved by the multitude of a host: A mighty man is not delivered by great strength.
- Bible in Basic English (BBE)
- A king's salvation is not in the power of his army; a strong man does not get free by his great strength.
- Darby Translation (DBY)
- The king is not saved by the multitude of [his] forces; a mighty man is not delivered by much strength.
- Webster's Bible (WBS)
- There is no king saved by the multitude of a host: a mighty man is not delivered by much strength.
- Young's Literal Translation (YLT)
- The king is not saved by the multitude of a force. A mighty man is not delivered, By abundance of power.
Read in context
- 14తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
- 15ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు.
- 16ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
- 17రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.
- 18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
Cross references
- Psalm 44:3 కీర్తనలు 44:3వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
- Jeremiah 9:23 యిర్మీయా 9:23యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
- Psalm 44:6–7 కీర్తనలు 44:6–7నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
- Judges 7:2 న్యాయాధిపతులు 7:2యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.
- 2 Chronicles 32:8–9 2 దినవృత్తాంతములు 32:8–9మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి. ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను
- 1 Samuel 17:45–49 1 సమూయేలు 17:45–49దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.
- 2 Samuel 21:16–22 2 సమూయేలు 21:16–22అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలదినేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి. అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫా యీయుల సంతతివాడగు సఫును చంపెను. తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొక డుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతని కుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రా యేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతివారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.
- Exodus 14:28 నిర్గమకాండము 14:28నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- 1 Samuel 14:8–16 1 సమూయేలు 14:8–16అప్పుడు యోనాతానుమనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము. వారు మనలను చూచిమేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము. మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్ప గించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచిమేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతానునా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీ యుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయు వానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయు వాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
- 2 Chronicles 32:21 2 దినవృత్తాంతములు 32:21యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.
- Joshua 14:12 యెహోషువ 14:12కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీ యులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును.
- Judges 7:12–25 న్యాయాధిపతులు 7:12–25మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదే మనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయు డైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును విని నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రా యేలీయుల దండులోనికి తిరిగి వెళ్లిలెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్ప గించుచున్నాడని చెప్పి ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను - నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచుయెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రా యేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూత లను పంపిమిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.