Isaiah · chapter 33 · verse 5
Isaiah 33:5 in Telugu
యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
Yehovaa mahaa ghanata nondiyunnaadu aayana unnatasthalamuna nivasinchuchu nyaayamutonu neetitonu seeyonunu nimpenu.
Isaiah 33:5 in English
- King James Version (KJV)
- The LORD is exalted; for he dwelleth on high: he hath filled Zion with judgment and righteousness.
- World English Bible (WEB)
- The LORD is exalted, for he dwells on high. He has filled Zion with justice and righteousness.
- American Standard Version (ASV)
- Jehovah is exalted; for he dwelleth on high: he hath filled Zion with justice and righteousness.
- Bible in Basic English (BBE)
- The Lord is lifted up; his place is on high: he has made Zion full of righteousness and true religion.
- Darby Translation (DBY)
- Jehovah is exalted; for he dwelleth on high: he hath filled Zion with justice and righteousness;
- Webster's Bible (WBS)
- The LORD is exalted; for he dwelleth on high: he hath filled Zion with judgment and righteousness.
- Young's Literal Translation (YLT)
- Set on high is Jehovah, for He is dwelling on high, He filled Zion [with] judgment and righteousness,
Read in context
- 3మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.
- 4చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు
- 5యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
- 6నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
- 7వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు.
Cross references
- Isaiah 2:17 యెషయా 2:17అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
- Daniel 4:37 దానియేలు 4:37ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
- Isaiah 32:15–18 యెషయా 32:15–18అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
- Revelation 19:2–6 ప్రకటన 19:2–6ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- Ephesians 1:20–21 ఎఫెసీయులకు 1:20–21ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
- Romans 11:26 రోమీయులకు 11:26వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
- Exodus 15:1 నిర్గమకాండము 15:1అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి - యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
- Isaiah 1:26–27 యెషయా 1:26–27మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.
- Psalm 118:16 కీర్తనలు 118:16యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును.
- Isaiah 12:4 యెషయా 12:4యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి.
- Psalm 46:9–10 కీర్తనలు 46:9–10ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
- Isaiah 60:21 యెషయా 60:21నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.