Isaiah · chapter 35 · verse 6
Isaiah 35:6 in Telugu
కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
Kuntivaadu duppivale gantuluveyunu moogavaani naaluka paadunu aranyamulo neellu ubukunu adavilo kaaluvalu paarunu
Isaiah 35:6 in English
- King James Version (KJV)
- Then shall the lame [man] leap as an hart, and the tongue of the dumb sing: for in the wilderness shall waters break out, and streams in the desert.
- World English Bible (WEB)
- Then the lame man will leap like a deer, and the tongue of the mute will sing; for waters will break out in the wilderness, and streams in the desert.
- American Standard Version (ASV)
- Then shall the lame man leap as a hart, and the tongue of the dumb shall sing; for in the wilderness shall waters break out, and streams in the desert.
- Bible in Basic English (BBE)
- Then will the feeble-footed be jumping like a roe, and the voice which was stopped will be loud in song: for in the waste land streams will be bursting out, and waters in the dry places.
- Darby Translation (DBY)
- then shall the lame [man] leap as a hart, and the tongue of the dumb sing: for in the wilderness shall waters break out, and torrents in the desert.
- Webster's Bible (WBS)
- Then shall the lame [man] leap as a hart, and the tongue of the dumb shall sing: for in the wilderness shall waters break out, and streams in the desert.
- Young's Literal Translation (YLT)
- Then leap as a hart doth the lame, And sing doth the tongue of the dumb, For broken up in a wilderness have been waters, And streams in a desert.
Read in context
- 4తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
- 5గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును
- 6కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
- 7ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
- 8అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
Cross references
- John 5:8–9 యోహాను 5:8–9యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- Luke 11:14 లూకా 11:14ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
- John 7:37–39 యోహాను 7:37–39ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
- Matthew 12:22 మత్తయి 12:22అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
- Isaiah 32:4 యెషయా 32:4చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
- Matthew 9:32–33 మత్తయి 9:32–33యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
- Psalm 51:15 కీర్తనలు 51:15ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
- Luke 1:64 లూకా 1:64వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.
- Psalm 78:15–16 కీర్తనలు 78:15–16అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
- Numbers 20:11 సంఖ్యాకాండము 20:11అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
- Ezekiel 47:1–11 యెహెజ్కేలు 47:1–11అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణ ముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను. నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును. మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలము లును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.
- Psalm 46:4 కీర్తనలు 46:4ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.